BigTV English

Eagle First Day Collections : ఈగల్ ఫస్ట్ డే కలెక్షన్స్.. అదిరిపోయిన మాస్ ఓపెనింగ్స్

Eagle First Day Collections : ఈగల్ ఫస్ట్ డే కలెక్షన్స్.. అదిరిపోయిన మాస్ ఓపెనింగ్స్

Ravi Teja’s Eagle Movie first Day Collections: మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా.. ఈగల్(Eagle) ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదలైంది. తెలుగుతో పాటు హిందీలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమాలో మాస్ మహారాజా మాస్ యాక్షన్ అదిరిపోయిందని అభిమానులు, సినీ ప్రేక్షకులు రివ్యూలు ఇచ్చారు. వీకెండ్, పైగా వాలెంటైన్ వీక్ కావడం.. మరో పెద్దహీరో సినిమా లేకపోవడం.. ఈగల్ కు కలిసొచ్చిందనే చెప్పాలి. కార్తీక్ ఘట్టమనేని సినిమాను తెరకెక్కించిన విధానంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.


ముఖ్యంగా రవితేజ ఇంట్రడక్షన్.. ఆ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయని సోషల్ మీడియాలో మీమ్స్, పబ్లిక్ టాక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. టైగర్ నాగేశ్వరరావు వంటి డిజాస్టర్ తర్వాత రవితేజ నటించిన.. ఈ సినిమాకు తొలిరోజు కలెక్షన్స్(Eagle Firstday Collections) బాగానే వచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా విడుదలైన ఈగల్ సినిమాకు తొలిరోజు రూ.6 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. తెలుగురాష్ట్రాల్లో తొలిరోజు 37.78 శాతం ఆక్యుపెన్సీ, హిందీలో 7.46 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా స్క్రీన్ లలో ఈగల్ విడుదలవ్వగా.. తొలిరోజు నైజాంలో రూ.6 కోట్లు, సీడెడ్ లో రూ.2.50 కోట్లు, ఏపీలో మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ.8.50 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది. మొత్తం రూ.17 కోట్లు తెలుగులో రాగా.. కర్ణాటక, మిగతా ప్రాంతాల్లో రూ.2 కోట్లు, ఓవర్సీస్ లో రూ.2 కోట్లు కలిపి.. మొత్తంగా రూ.21 కోట్లు బిజినెస్ జరిగింది. అమెరికా, కెనడాలో 65K, ఐర్లాండ్ లో 23K, UAE, ఆస్ట్రేలియాలో 8K, గల్ఫ్ లో 250 డాలర్లను సాధించింది. మొత్తం మొదటిరోజు ఓవర్సీస్ లో 3.9 కోట్ల రూపాయలు సాధించింది. మొత్తంగా.. రూ.24.9 కోట్ల బిజినెస్ చేసింది ఈగల్. సినిమాను రూ.60 కోట్ల వ్యయంతో నిర్మించగా.. బ్రేక్ ఈవెన్ రావాలంటే.. సుమారుగా 35 కోట్ల కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది.


మాస్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఒక జర్నలిస్ట్ గా కనిపించింది. సినిమాలో ఫైట్స్, క్లైమాక్స్ సీన్స్ చాలా బాగున్నాయని టాక్ వచ్చింది.

సూర్య వర్సెస్ సూర్యతో ప్రేక్షకులకు సరికొత్త కాన్సెప్ట్ ను పరిచయం చేసిన డైరెక్టర్ కార్తీక్.. ఇప్పుడు రవితేజను ఈగల్ గా చూపించడంలోనూ సూపర్ సక్సెస్ అయ్యాడని నెటిజన్లు అభినందిస్తున్నారు. నిజానికి ఈగల్ జనవరి 12.. సంక్రాంతి బరిలో విడుదల కావాల్సి ఉండగా.. అదే సమయంలో గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ సినిమాలు వరుసగా రిలీజ్ అవడంతో.. ఈగల్ కాస్త వెనక్కి తగ్గక తప్పలేదు. అప్పుడే రిలీజ్ చేసి ఉంటే ఈ కలెక్షన్స్ వచ్చేవి కావేమో. ఏదేమైనా.. ఈగల్ రవితేజ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలుస్తుందని మేకర్స్ మొదటి నుంచీ చెబుతున్నట్లే సినిమా ఉందంటున్నారు.

కథ

ఓ ఇంగ్లీష్ పేపర్‌లో జర్నలిస్ట్‌గా పనిచేసే నళిని (Anupama Parameshwaran) అనుకోకుండా అరుదైన పత్తితో నేసిన ఒక స్పెషల్ కాటన్ క్లాత్‌ను చూస్తుంది. దాని గురించి పూర్తిగా తెలుసుకుంటుంది. అయితే ఆ క్లాత్‌కి విపరీతమైన పబ్లిసిటీ చేసి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి కనబడట్లేదు అని తెలుసుకుంటుంది. దీంతో అదే విషయంపై ఆమె పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ రాయడంతో సీబీఐ రంగంలోకి దిగి నళిని పనిచేసే సంస్థపై దాడి చేస్తాయి.

దీంతో నళిని జోబ్ పోతుంది. అక్కడ ఆమెకు ఒక డౌట్ మొదలవుతుంది. అంత చిన్న న్యూస్‌కి ఇంతలా అందరూ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అని అనుకుని.. అసలు మిస్సయిన సహదేవ్ వర్మ ఎవరు? అని తెలుసుకునేందుకు నళిని ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి తాలూకాలో ఉన్న తలకోన ప్రాంతానికి వెళ్తుంది.

ఆ గ్రామంలో ఒక్కొక్కరినీ అడుగుతూ ఆ పత్తి గురించి.. ఆ పత్తిని విదేశాల్లో ఫేమస్ చేసిన సహదేవ్ (Raviteja) గురించి తెలుసుకుంటుంది. ఈ క్రమంలో అతను ఈగల్ అని.. ప్రపంచ దేశాలు అతని కోసం వెతుకుతున్నారని తెలుసుకుంటుంది. అయితే ఎక్కడో యూరప్‌లో సఫారీ తీసుకుని కాంట్రాక్టు కిల్టింగ్ చేసే స్నైపర్ సహదేవ్ వర్మ తలకోన అడవుల్లో ఏం చేస్తున్నాడు.

కాంట్రాక్ట్ కిల్లింగ్స్ ఆపేసి.. పత్తిని పండిస్తూ చేనేత కార్మికులను ముందుకు తీసుకువెళ్లాలని ఎందుకు అనుకున్నాడు?. అతని గురించి పేపర్లో రాస్తే సీబీఐ ఎందుకు కంగారు పడాల్సి వచ్చింది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×