E-Paper
Advertisement

Telangana Cabinet meeting | డిసెంబరు 9 నుంచి రెండు గ్యారెంటీలు అమలు

Telangana Cabinet | తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ప్రజల సమస్యలపై కేబినెట్ తొలి మీటింగ్‌లో మంత్రులు చర్చించారు. ఈ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డితోపాటు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరి శాంతి కుమారి, రాష్ట్ర మంత్రులు, మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.

Telangana Cabinet meeting | డిసెంబరు 9 నుంచి రెండు గ్యారెంటీలు అమలు

Telangana Cabinet meeting | తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ప్రజల సమస్యలపై కేబినెట్ తొలి మీటింగ్‌లో మంత్రులు చర్చించారు. ఈ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డితోపాటు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరి శాంతి కుమారి, రాష్ట్ర మంత్రులు, మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణియించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కేబినెట్ మీటింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను డిసెంబర్ 9, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభిస్తామని శ్రీధర్ బాబు ప్రకటించారు.

తొలి గ్యారంటీగా మహిళలకు రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం, రూ.10లక్షల వరకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పెంపు హామీలను డిసెంబర్ 9 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. రెండు గ్యారంటీల అమలుపై శుక్రవారం శాఖలవారీగా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిస్తారని ఆయన చెప్పారు.

”డిసెంబర్ 7 2023, వరకు తెలంగాణ ప్రభుత్వం ఏయే శాఖలో ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు.. దేనికోసం ఖర్చు చేశారు. ప్రజలకు వాటి ప్రయోజనాలు ఎంత వరకు చేరవయ్యాయి అనే అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విధంగా అన్ని వివరాలతో కూడిన అన్ని అంశాలు ప్రజలకు తెలియజేయాలని అధికారులను కోరుతున్నాము. మంత్రివర్గ భేటీలో ఆరు గ్యారంటీలకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించాం. అందులో భాగంగా రెండు గ్యారంటీలను తొలుత అమలు చేయాలని నిర్ణయించాం. ఆయా శాఖల అధికారులతో శుక్రవారం చర్చించి 9వ తేదీన వాటిని అమలు చేసే కార్యక్రమాలు చేపడతాం. దీనికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

తెలంగాణలో పరిశ్రమలకు ఏ ఇబ్బంది కలుగకుండా సాగుకు 24 గంటల పాటు కరెంటు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా కార్యాక్రమంలో పాల్గొంటారు. గత తొమ్మిదేళ్లులో విద్యుత్‌కు సంబంధించి రాష్ట్రప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించలేదు. అలాగే గృహ వినియోగదారులకోసం 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌పై చర్చించాం. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, ప్రొటెం స్పీకర్‌ ఎన్నిక డిసెంబర్ 9న జరుగుతుంది. గవర్నర్‌ ప్రొటెం స్పీకర్‌ను నియమించిన తర్వాత.. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. భారీ వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ప్రాంతాలను, జిల్లాలో సంబంధించిన మంత్రులు సమీక్షిస్తారు,” అని శ్రీధర్‌బాబు తెలిపారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×