E-Paper
Advertisement

CM Revanth Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం ఒక టీమ్ వర్క్.. ఇక నుంచి ప్రజలకు చేరువలో సిఎం

CM Revanth Reddy | కాంగ్రెస్ లో వన్ మ్యాన్ షో ఉండదు.. అంతా టీమ్ వర్క్ లా పని చేస్తారు.. ఇదీ కేసీ వేణుగోపాల్ రేవంత్ పేరును సీఎల్పీ నేతగా ప్రకటించిన సందర్భంలో చెప్పిన మాట. ఇక్కడ అందరి అభిప్రాయాలకు విలువ ఉంటుంది. అందరి సూచనలూ స్వీకరించబడుతాయి.. సామాన్యులు తమ సమస్యలను నేరుగా చెప్పుకునేలా ఏర్పాట్లూ ఉంటాయ్. పాలన గాడిలో పడాలంటే.. కుదురుకోవాలంటే కొంత టైం పడుతుంది. అయితే సాధ్యమైనంత త్వరగానే రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది.

CM Revanth Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం ఒక టీమ్ వర్క్.. ఇక నుంచి ప్రజలకు చేరువలో సిఎం

CM Revanth Reddy | కాంగ్రెస్ లో వన్ మ్యాన్ షో ఉండదు.. అంతా టీమ్ వర్క్ లా పని చేస్తారు.. ఇదీ కేసీ వేణుగోపాల్ రేవంత్ పేరును సీఎల్పీ నేతగా ప్రకటించిన సందర్భంలో చెప్పిన మాట. ఇక్కడ అందరి అభిప్రాయాలకు విలువ ఉంటుంది. అందరి సూచనలూ స్వీకరించబడుతాయి.. సామాన్యులు తమ సమస్యలను నేరుగా చెప్పుకునేలా ఏర్పాట్లూ ఉంటాయ్. పాలన గాడిలో పడాలంటే.. కుదురుకోవాలంటే కొంత టైం పడుతుంది. అయితే సాధ్యమైనంత త్వరగానే రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది.

గత పదేళ్లుగా కేసీఆర్ సర్కార్ ఏమేం తప్పులు చేసిందో అవన్నీ రేవంత్ కు తెలుసు. ఆ తప్పులను సరి చేసే బాధ్యత కొత్త సీఎంపై ఉంది. డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు చాలా సమయమే పట్టేట్లు కనిపిస్తోంది. అయితే దీన్ని ఎలా డీల్ చేయాలో రేవంత్ రెడ్డికి చాలా బాగా తెలుసు. అదే సమయంలో ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ భాగస్వామ్యం కాకపోయినా.. ప్రభుత్వం రన్ అవుతున్న తీరు బాగా తెలిసిన వ్యక్తి. ఎవరికి ఏం అవసరమో తెలుసు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబంలోని నలుగురే శత్రువులు అని మిగితా వారు తమ తప్పులకు క్షమాపణలు చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా జనజీవితంలోకి రావాలని పోలింగ్ ముగిసిన రోజే చెప్పారు.

ఈ మాట చెప్పడం ద్వారా ప్రత్యర్థులకు కూడా సీఎం రేవంత్ క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చేశారు. ఎవరితోనూ ప్రత్యేకంగా వైరం పెట్టుకోదలుచుకోలేదని క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు గతంలో కాంగ్రెస్ హయాంలో సీఎంలను ఎవరైనా సులువుగా కలిసే అవకాశం ఉండేదని ఇప్పుడూ అదే ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు. ప్రగతి భవన్ కు జ్యోతిబాపూలేగా నామకరణం చేశారు.

అంతే కాదు.. గతంలో ప్రగతి భవన్ విషయంలో, తెలంగాణ సచివాలయం విషయంలో ఏం జరిగిందో ఇకపై అది జరగదని కూడా చెప్పారు.

ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం సాక్షాత్కారమైందంటే అది ప్రజలతోనే అని సీఎం రేవంత్ తన సందేశంలో చెప్పుకొచ్చారు. అంతే కాదు.. ఇన్నాళ్లూ ఒక సీఎం నుంచి ప్రజలు ఏదైతే కోరుకున్నారో… దాన్ని నెరవేర్చేదిశగా రేవంత్ అడుగులు వేశారు. ప్రజాదర్బార్ కు రెడీ అన్నారు. ప్రజల పాలనకు స్వాగతం అంటూ చెప్పుకొచ్చారు.

ప్రజా పాలన అంటే ఇదే అని.. తాను గతంలో ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామకపత్రంపై సంతకం చేశారు. అంతే కాదు.. 6 గ్యారెంటీలపైనా తొలి సంతకం చేశారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×