E-Paper
Advertisement

Telangana CM : ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను..!

Telangana CM : ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను..!
Advertisement
Telangana new CM updates

Telangana new CM updates(Telangana congress news today):

ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంటూ చెప్పబోయే క్షణాలు మరికొద్ది గంటల్లోనే రానున్నాయి. అశేష తెలంగాణ ప్రజానీకం, ఇండియా కూటమి అగ్ర నేతలు, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల సమక్షంలో.. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఎల్బీ స్టేడియంలో చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు, పోలీసులు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాణస్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు, వీవీఐపీలు హాజరుకానుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక నిన్న ఢిల్లీ వెళ్ళిన రేవంత్ రెడ్డి.. సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేలతో సమావేశం అయ్యి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. అయ్యారు. తనపై నమ్మకం ఉంచి, అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. అలానే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి… కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక మంత్రులు.. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్ బఘెల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్.. తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు… కేసీఆర్‌కు కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపించింది.

Advertisement

అలాగే మరికొంద‌రు సీనియ‌ర్ నేత‌ల‌కూ రేవంత్ సంత‌కంతో కూడిన ఆహ్వాన ప‌త్రాల‌ను పంపారు. వీరితో పాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సైతం రేవంత్ ఆహ్వానం పంపారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, కంచె ఐలయ్యలతో పాటు వివిధ కులసంఘాల నేతలను ఆహ్వానించారు. అంతే కాకుండా ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా పలువురు సినీ ప్రముఖులకు సైతం ఆహ్వానాలు పంపినట్లు సమాచారం అందుతుంది. ప్రముఖులతో పాటు అమరవీరుల కుటుంబాలు, దివ్యాంగురాలైన నిరుద్యోగ యువతి రజినీకి సైతం ఆహ్వానం అందించారు రేవంత్.

ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను కాంగ్రెస్‌ నేత మల్లు రవి పరిశీలిస్తుండగా.. భారీగా ప్రజలు తరళీవచ్చే అవకాశం ఉన్నందున పకడ్బంధీగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు డీజీపీ రవిగుప్తా చెప్పారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. రజినీకే తొలి ఉద్యోగమిస్తానని రేవంత్ గతంలో ప్రకటించారు. ప్రమాణస్వీకారం అనంతరం ఆరు గ్యారెంటీల ఫైల్‌పై సీఎంగా రేవంత్ రెడ్డి తొలి సంతకం చేసే అవకాశం కనిపిస్తోంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×