E-Paper
Advertisement

Telangana CM Oath Ceremony : కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం.. మంత్రివర్గంలో వీరికే ఛాన్స్..!

Telangana CM Oath Ceremony : కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం.. మంత్రివర్గంలో వీరికే ఛాన్స్..!
Telangana new Cabinet ministers

Telangana new Cabinet ministers(Political news in telangana) :

తెలంగాణలో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎల్బీస్టేడియం వేదికగా సీఎంగా రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్‌తోపాటు 9 నుంచి 11 మంది మంత్రులుగా ప్రమాణం చేసే ఛాన్స్‌ ఉంది. వీరిలో మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌ లేదా ఆయన సతీమణి పద్మావతిరెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, సీతక్క, షబ్బీర్‌ అలీ, పొన్నం ప్రభాకర్‌లు ఉన్నట్టు తెలుస్తోంది.

వీరితోపాటు దామోదర రాజనర్సింహ, గడ్డం వివేక్‌, తుమ్మల నాగేశ్వరరావు, పి.సుదర్శన్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా ప్రమాణం చేసే అవకాశముందన్న టాక్‌ నడుస్తోంది. డిప్యూటీ సీఎంగా భట్టిని నియమిస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే.. ఈ పదవికి ఎవరికి ఇచ్చే అవకాశాలు లేవన్న చర్చ నడుస్తోంది. కాగా సీనియర్‌ నేతలైన కొందరికి కేటాయించే శాఖలపై కొంత స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఇందులో శ్రీధర్‌బాబుకు ఆర్థికశాఖ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. స్పీకర్‌ పదవిని ఆయన తిరస్కరించడంతో ఆర్థిక శాఖ కేటాయించినట్టు సమాచారం. అలాగే భట్టి విక్రమార్కకు రెవెన్యూశాఖ ఇచ్చే ఛాన్స్‌ ఉందని టాక్‌. భట్టినే డిప్యూటీ సీఎం గా నియమించి రెవెన్యూ లేదా మరేశాఖ అయినా కేటాయించే అవకాశముంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నీటిపారుదల శాఖ కేటాయిస్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే.. 17 మంది మంత్రుల్లో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు..?, రేవంత్‌తోపాటు ప్రమాణం చేసే మంత్రలెవరన్నది ఆసక్తిగా మారింది.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×