E-Paper
Advertisement

Telangana Congress : భూరికార్డులు మారుస్తున్నారు.. బీఆర్ఎస్ సర్కార్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు..

Telangana Congress : భూరికార్డులు మారుస్తున్నారు.. బీఆర్ఎస్ సర్కార్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు..
Advertisement

Telangana Congress : తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ప్రభుత్వ ఆక్రమ చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వ లావాదేవీలపై నిఘాపెట్టాలని డిమాండ్ చేస్తోంది. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని నిధులు మళ్లించే ఛాన్స్‌ ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్‌. దీనిపై ఎన్నికల సంఘం ఫోకస్‌ పెట్టాలని కోరింది. ఈ మేరకు అధికారులను కలిసి కేసీఆర్‌పై ఫిర్యాదు చేసింది కాంగ్రెస్‌ బృందం .

పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ బృందం తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ను కలిసింది. రైతు బంధు నిధులను కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు మళ్లించే అవకాశముందని అనుమానం చేసింది. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న అసైన్డ్‌ ల్యాండ్‌లను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతోందన్న సందేహాలు వ్యక్తం చేశారు. వికాస్‌రాజ్‌ను రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిశారు. 4 అంశాలపై వినతిపత్రం ఇచ్చారు.

Advertisement

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు నిధులు మళ్లిస్తోందని ఉత్తమ్‌ తెలిపారు. అసైన్డ్ భూముల రికార్డులు మార్చుతున్నారని చెప్పామన్నారు. భూ రికార్డులు మారుస్తున్న సమాచారం తమకి ఉందన్నారు. ఢిల్లీలో సీఈవో దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో తప్పులు జరుగుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల భూ రికార్డులు మారుస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులపై జోక్యం తీసుకోవాలని సీఈవో వికాస్ రాజ్ ను కోరామన్నారు.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×