Big Stories

Mars Helicopter : మార్స్‌పైకి చైనా ‘ఫోల్డబుల్’ హెలికాప్టర్!

Mars Helicopter

Mars Helicopter : అంతరిక్ష పరిశోధనల్లో నాసాతో చైనా పోటీ పడుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఫోల్డబుల్ మార్స్ హెలికాప్టర్‌కు రూపకల్పన చేసే పనిలో మునిగిపోయారు డ్రాగన్ శాస్త్రవేత్తలు. నాసా ఇన్‌జెన్యూనిటీ క్వాడ్‌కాప్టర్ తరహాలోనే ఇది ఉంటుంది. అంగారక గ్రహం నుంచి నమూనాల సేకరణకు, ఆ గ్రహంపై భవిష్యత్తు పరిశోధనల కోసం ప్రతిపాదిత రోటార్‌క్రాఫ్ట్ ఉపయోగపడనుంది.

- Advertisement -

ఇతర గ్రహాలపైకి పంపిన నాసా క్యూరియాసిటీ లేదా చైనా ఝురాంగ్ రోవర్లు ఇప్పటివరకు ఉపరితలంపై చక్రాల సాయంతో కదిలేవి. అయితే రెండేళ్ల క్రితం నాసా ప్రయోగించిన ఇన్‌జెన్యూనిటీ మార్స్ హెలికాప్టర్.. గ్రహాల పరిశోధనల్లో విప్లవాత్మక ముందడుగు అనే చెప్పొచ్చు. రెడ్ ప్లానెట్‌పై ఇన్‌‌జెన్యూనిటీ హెలికాప్టర్ ఇటీవలే 66వ సారి మార్స్ వాతావరణంలో ఎగిరింది. వర్టికల్ టాకేఫ్ సామర్థ్యం, 1.8 కిలోల బరువున్న చాపర్ విజయవంతమైన మోడల్‌గా నిలిచింది.

- Advertisement -

చైనా పరిశోధకులు దీనిని స్ఫూర్తిగా తీసుకుని మార్స్‌బర్డ్-7 క్వాడ్‌కాప్టర్‌‌ను రూపొందించారు. అంగారక గ్రహంపై రాళ్లను సేకరించి తిరిగి నేరుగా లాండర్ మిషన్‌కే చేర్చగల సామర్థ్యం దాని సొంతం. నాసా హెలికాప్టర్ విషయంలో మాత్రం వర్టికల్ టేకాఫ్, మార్స్ వాతావరణంలో ఎగరగల ప్రత్యేకతలపై మాత్రమే దృష్టి సారించారు. ఫోల్డబుల్ డిజైన్ చైనా క్వాడ్‌కాప్టర్ మరో ప్రత్యేకత.

మార్స్ చుట్టూ తిరుగుతూ ఆర్బిటర్లు అందించే సమాచారం, మార్స్‌ ఉపరితలంపై తిరుగాడే రోవర్ల ద్వారా అందే డేటా మధ్య అంతరాలు ఏవైనా ఉంటే మార్స్‌బర్డ్ భర్తీ చేస్తుందని చైనాలోని హార్బిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
పరిశోధకులు చెబుతున్నారు. 4 కిలోల బరువు ఉండే ఈ రోటార్‌క్రాఫ్ట్ ద్వారా ఎక్కువ విస్తీర్ణాన్ని కవర్ చేయడమే కాకుండా సంక్లిష్ట ఉపరితలాలను సైతం పరిశీలించే అవకాశం లభిస్తుందని అంటున్నారు.

మార్స్‌బర్డ్ 100 గ్రాముల వరకు శాంపిళ్లను కలెక్ట్ చేసి.. మిషన్ లాండర్‌కు చేర్చగలదని కూడా పరిశోధకులు చెబుతున్నారు. గైడెన్స్, నావిగేషన్ అండ్ కంట్రోల్(GNC) సిస్టమ్‌తో పాటు రాళ్ల శాంపిళ్లను సేకరించగల రోబోటిక్ ఆర్మ్ చైనా క్వాడ్‌కాప్టర్‌లో అంతర్భాగంగా ఉంటాయి.
మార్స్ పల్చటి వాతావరణంలో సైతం చక్కగా ఆపరేషన్లు నిర్వహించగలిగిన రీతిలో దీని డిజైన్‌ను, అటానమసన్ ఫ్లయిట్ అల్గారిథమ్‌ను మరింత మెరుగుపర్చేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News