Telangana Congress Tweet: అధికార కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య రాజకీయాలు తారాస్థాయికి చేరాయా? ఢీ అంటే ఢీ అంటున్నాయా? తెలంగాణ కాంగ్రెస్ చేసిన పోస్టు వెనుక అసలేం జరుగుతోంది? రేవంత్ సర్కార్‌ను బద్నాం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు స్కెచ్ వేశారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది కూడా కాలేదు. కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకునేందుకు విపక్షాలు కొంత సమయం ఇస్తారు. కేంద్రమైనా, రాష్ట్రమైనా ఎక్కడైనా ఇది సహజమే.
రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నుంచి బీఆర్ఎస్ ఒకటే కాన్సెప్ట్ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.
సింపుల్‌గా చెప్పాలంటే అధికార పార్టీ నిర్ణయాన్ని ప్రతీది రాజకీయం చేయడం మొదలు పెట్టేసింది. బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలు కాంగ్రెస్ నేతలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీలో ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టింది. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కేసీఆర్ ప్లాన్ అని, అధికారులపై దాడిని కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు సమర్థిస్తున్నారని రాసుకొచ్చింది.
ALSO READ: ప్రభుత్వంపై భారీ కుట్రలు.. కేటీఆర్ కు శిక్ష తప్పదు… పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
బీఆర్ఎస్ నాయకులకు రైతులు, మహిళలు, నిరుద్యోగులంటూ ముసుగు వేసి, ధర్నాలు నిర్వహించి, దాడులు చేసి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు విధ్వంసకర వ్యూహాలు అంటూ రాసుకొచ్చింది.
తెలంగాణ కాంగ్రెస్ చేసిన ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లు అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక పోతుందని అంటున్నారు.
రాజకీయ ముసుగులో విధ్వంసానికి వ్యూహ రచన చేస్తోందన్నది కాంగ్రెస్ నేతల మాట. ఇందుకు ఉదాహరణే లగచర్ల దాడి ఘటనని పేర్కొంటున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదలు మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి సైతం దాడిని పక్కాగా ప్లాన్ చేశారని పదేపదే చెబుతున్నారు.
భూసేకరణను రైతులు ఒప్పుకోలేక ఈ దాడికి పాల్పడ్డారన్నది బీఆర్ఎస్ నేతల మాట. అధికారులు ఇప్పటివరకు గుర్తించిన ఆధారాల మేరకు గుర్తించిన నిందితుల్లో 42 మందిలో 19 మందికి భూమి లేదు. దీనికి బీఆర్ఎస్ ఏం చెబుతుంది? మరికొందరి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.
రైతుల వద్దకు అధికారులకు వచ్చినప్పుడు వారి సమస్యలు చెప్పుకొవాలి. కలెక్టర్ వచ్చిన తర్వాత దాడులు చేయడం వెనుక కారణమిదేనని అంటున్నారు. ఘటనకు వారం ముందు జరిగిన ఫోన్ కాల్‌ను విశ్లేషించే పనిలో పడ్డారట పోలీసులు.
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీఆర్ఎస్ చుట్టూనే ఈ కేసు వ్యవహారం తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కేసీఆర్ ప్లాన్.
అధికారుల పై దాడిని సమర్థిస్తున్న కేటీఆర్ & బీఆర్ఎస్ నాయకులు.
బీఆర్ఎస్ నాయకులకు రైతులు, మహిళలు, నిరుద్యోగులు అంటూ ముసుగు వేసి, ధర్నాలు నిర్వహించి, దాడులు చేసి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు విధ్వంసకర వ్యూహాలు. pic.twitter.com/gqTpGUWpff
— Telangana Congress (@INCTelangana) November 14, 2024