Sandeep Kumar: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు పార్టీ యంత్రాంగం, సోషల్ మీడియా విభాగం సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ సందీప్ కుమార్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం గాంధీ భవన్లో జరిగిన వరుస సమీక్షా సమావేశాలు,ముఖ్య నేతలతో ముఖాముఖి భేటీలో ఆయన పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.ప్రభుత్వ కార్యక్రమాలు ,పార్టీ ప్రచారాల మధ్య సమన్వయ లోపం వల్ల ఆశించిన స్థాయిలో వేగం కనిపించడం లేదని అభిప్రాయపడినట్లు సమాచారం. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను పార్టీ కార్యక్రమాలతో అనుసంధానం (మెర్జ్) చేసి, క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన నేతలకు సూచించారు.
మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా సమావేశం..
గాంధీ భవన్లసందీప్ కుమార్తో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, సంస్థాగత అంశాలపై చర్చించారు. అనంతరం సందీప్ కుమార్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లతో విడివిడిగా ముఖాముఖి నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఫీడ్బ్యాక్ తీసుకున్నారు.ఏఐసీసీ ఇన్ చార్జ్ తో వరుసగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, వేముల వీరేశం, ఎంపీలు సురేష్ షెట్కార్, అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మల్రెడ్డి రంగారెడ్డి, నాగరాజు, రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మురళి నాయక్, నాయిని రాజేందర్ రెడ్డి, నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు.
సోషల్ మీడియా విభాగం పనితీరుపై సమీక్ష..
తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ నవీన్ పెట్టెం ఆధ్వర్యంలో గాంధీ భవన్లో సోషల్ మీడియా విభాగం ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. ఏఐసీసీ ఇన్చార్జ్ సందీప్ కుమార్ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో విభాగం సంస్థాగత బలోపేతం, ఇప్పటివరకు చేపట్టిన ప్రచార కార్యక్రమాలు,భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల స్థాయిలో సమన్వయాన్ని మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డా. గిరిజా షెట్కర్, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వంశీ, రాష్ట్ర సమన్వయకర్తలు విష్ణు, ఫరీద్, దినేష్, సుశీల్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: హైదరాబాద్లో గంజాయి కలకలం.. 29.810 కిలోలు సీజ్.. లాడ్జి మేనేజర్ సహా ముగ్గురు అరెస్ట్