E-Paper
Advertisement

Telangana Elections 2023 : సింగిల్ గానే బరిలోకి..ఆ నియోజకవర్గాల నుంచి విజయమ్మ, అనిల్ పోటీ?

Telangana Elections 2023 : సింగిల్ గానే బరిలోకి..ఆ నియోజకవర్గాల నుంచి విజయమ్మ, అనిల్ పోటీ?

Telangana Elections 2023 : తెలంగాణలో వైఎస్సార్ టీపీ అన్ని నియోజకవర్గాల్లో సింగిల్ గా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాల్లో వైఎస్సార్టీపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో షర్మిల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ నుంచి వైఎస్ కుటుంబసభ్యులు పోటీ చేయబోతున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి తాను బరిలోకి దిగుతానని షర్మిల స్పష్టం చేశారు. మిర్యాలగూడ నుంచి ఆమె తల్లి విజయమ్మ, సికింద్రాబాద్ నుంచి బ్రదర్ అనిల్‌కుమార్ పోటీ చేయొచ్చని తెలుస్తోంది. కార్యకర్తల నుంచి డిమాండ్ ఉందని, అవసరమైతే వాళ్లిద్దరూ పోటీ చేస్తారని షర్మిల క్లారిటీ ఇచ్చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే తాను కాంగ్రెస్‌తో నాలుగు నెలల పాటు చర్చలు జరిపానని పార్టీ కార్యవర్గ సమావేశంలో చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌టీపీ పోటీ చేస్తుందని నాయకులకు క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్టీపీ నుంచి టికెట్ కోసం ఆశావహులు అప్లై చేసుకోవచ్చన్నారు.

కాగా.. వైఎస్సార్ టీపీ ఏ పార్టీకి బీ-టీమ్ కాదని షర్మిల తెలిపారు. రెండురోజుల్లోనే పార్టీ మేనిఫెస్టో ప్రకటించనున్నారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రైతు, నాగలి గుర్తుకోసం ఇప్పటికే అప్లై చేసుకున్నారు. కాంగ్రెస్ తో కలిసి వైఎస్సార్టీపీ పోటీ చేస్తుందని అనుకుంటున్న సమయంలో.. సింగిల్ గా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించడంతో తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×