BigTV English

‘kannappa’ movie update : ఏంటి మంచు బ్రో…ఒక్క సినిమాకి ఇంతమంది స్టార్ యాక్టర్స్ అవసరమా…?

‘kannappa’ movie update : ఏంటి మంచు బ్రో…ఒక్క సినిమాకి ఇంతమంది స్టార్ యాక్టర్స్ అవసరమా…?
kannappa movie update

Manchu Vishnu Kannappa Movie(Cinema News in Telugu) :

టాలీవుడ్ లో మిమర్స్ కు ఫేవరెట్ ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ…మరి అలాంటి స్నో ఫ్యామిలీ నుంచి బిగ్ స్నో బ్రదర్ మంచు విష్ణు సరికొత్తగా ఓ సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది. సినిమా అంటే మామూలు సినిమా కాదు ఏకంగా భక్తకన్నప్ప లాంటి మూవీ ను చేస్తున్నాడు మంచు బ్రదర్. స్టోరీ పరంగా తీసుకుంటే భక్తకన్నప్ప మంచి డివోషనల్ చిత్రం.. పైగా వచ్చేది కార్తీక మాసం కాబట్టి మంచి టైం చూసి విడుదల చేస్తే కచ్చితంగా హిట్ అవుతుంది. కానీ అప్పటికి మూవీ పూర్తి అయితే.


ట్రోలింగ్ స్టార్ మంచు విష్ణు తను ఒక్కడే నటిస్తే ఈ మూవీ సక్సెస్ డౌటే కాబట్టి ప్రతి ఇండస్ట్రీలోని స్టార్ యాక్టర్స్ ను ఈ మూవీలో జోడించుకుంటూ పోతున్నాడు. గత ఐదేళ్ల నుంచి వరుస డిజాస్టర్ అందుకుంటున్నా ..ప్రేక్షకుల మీద కసి తీర్చుకోవడానికి అన్నట్టు వరుస చిత్రాలు చేస్తూ ఉన్నాడు. దీనికి తోడు స్నో బ్రదర్ ఏం మాట్లాడినా అది ఓ ఎక్స్ట్రార్డినరీ రేంజ్ లో ఉండడమే కాకుండా ట్రోలింగ్ కు సూపర్ సబ్జెక్ట్ అవుతోంది. అసలు టాలీవుడ్ లో మంచు విష్ణు ను హీరోగా పరిగణించే వారే లేరు.. కానీ స్నో బ్రదర్ మాత్రం తన కాన్ఫిడెన్స్ ఇంత కూడా తగ్గించుకోకుండా సినిమాలో తీయడానికి ఫిక్స్ అయిపోయాడు.

అందుకే ఎలాగైనా ఒక భారీ హిట్ కొట్టి.. విమర్శకులను హింసించైనా ప్రశంసలు అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. దీనికోసం ఒకటి కాదు రెండు కాదు మూడు సంవత్సరాల పాటు స్క్రిప్ట్ వర్క్ జరిపి భక్తకన్నప్ప మూవీ ని రీసెంట్ గా న్యూజిలాండ్ లోనే మొదలు పెట్టాడు. మరి ఈ చిత్రానికి న్యూజిలాండ్ కి సంబంధం ఏమిటి అని అడగకండి…స్నో అన్న అంతే. పైగా ఈ చిత్రం కోసం ఎనిమిది వందల మంది కష్టపడుతున్నారు అని తన ట్విట్టర్లో షేర్ కూడా చేశాడు.


సినిమా హిట్ అవ్వాలి అంటే అందులో ఓ మంచి స్టార్ హీరో ఉండి తీరాలి…అందుకే శివుడుగా ప్రభాస్, సీతగా నయనతార కనిపిస్తారు. ఇక ఈ చిత్రంలో మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ ఒక కీ రోల్ చేయబోతున్నారు.. అయితే ఇప్పుడు తాజాగా ఈ మూవీలో మరొక స్టార్ హీరో యాడ్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా విడుదలైన జైలర్ చిత్రంలో రజనీకాంత్ తో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ చేసిన సీన్ అందరికీ గుర్తుందా. మన మంచు బ్రదర్ ఆ సీన్ చూసి ఇన్స్పైర్ అయినట్టు ఉన్నాడు. అందుకే ఎలాగా మోహన్ లాల్ ఉన్నాడు కదా అని కన్నడ ఇండస్ట్రీ టాప్ హీరో శివన్న ని కూడా ఈ మూవీలో దింపేశాడు.

మరి ఒక్క సినిమా కోసం ఇంత మంది స్టార్ నటులను తీసుకుంటే బడ్జెట్ పెరగదా అంటే…పెరుగుతుంది. కానీ వీళ్ళందరి కోసమైనా సినిమా చూస్తే ఆ క్రెడిట్ మంచు బ్రదర్ పోతుంది. సో డైరెక్ట్ గా ..ఇన్ డైరెక్ట్ హిట్ కొట్టడానికి మంచు అన్న మంచి స్కెచ్ వేశాడు. ఇక భక్తకన్నప్ప స్టోరీ బ్యాక్ డ్రాప్ శ్రీ కాళహస్తిలో అన్న విషయం అందరికీ తెలుసు. స్టోరీకి ఎటువంటి సంబంధం లేని పొరుగు దేశానికే పోయి మరీ షూటింగ్ ఎందుకు తీస్తున్నారో ఎవరికి తెలియదు. న్యూజిలాండ్ అంటే బడ్జెట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించండి…ఈ సినిమాకి ముందు 80 కోట్ల బడ్జెట్ అని చెప్పారు ..ఆ తరువాత 100 కోట్లు అన్నారు.. ఇప్పుడు 150 కోట్లు అంటున్నారు. ఇక సినిమా పూర్తి అయ్యేసరికి బడ్జెట్ రెండింతలైన ఆశ్చర్యపోనక్కర్లేదు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×