BigTV English

Telangana Elections : ప్రశ్నిస్తే ఫ్రస్టేషనా?.. ప్రజలపై ఆగ్రహం చూపిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులు

Telangana Elections : అయిదేళ్ల కోసారి ఎన్నికలు రాగానే పదవిలో ఉన్న రాజకీయ నాయకులకు ఎక్కడలేని టెన్షన్ మొదలవుతుంది. ఇంతకుముందు ఇచ్చిన హామీలను నెరవేర్ఛని నేతలైతే ప్రజలను ఎలా ఎదుర్కోవాలనే ఆందోళనలో ఉంటారు.

Telangana Elections : ప్రశ్నిస్తే ఫ్రస్టేషనా?.. ప్రజలపై ఆగ్రహం చూపిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులు

Telangana Elections : అయిదేళ్ల కోసారి ఎన్నికలు రాగానే పదవిలో ఉన్న రాజకీయ నాయకులకు ఎక్కడలేని టెన్షన్ మొదలవుతుంది. ఇంతకుముందు ఇచ్చిన హామీలను నెరవేర్చని నేతలైతే ప్రజలను ఎలా ఎదుర్కోవాలనే ఆందోళనలో ఉంటారు.


ఎన్నికలు గెలిచాక ముఖం చూపించని నేతలు.. మళ్లీ అయిదేళ్ల తరువాత ఓట్లు అడగడానికి వస్తే ప్రజలు నుంచి తప్పకుండా వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే బీఆర్ఎస్ అభర్థులలో కనిపిస్తోంది.

ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, డోర్నకల్ నుంచి బీఆర్ఎస్ డీఎస్ రెడ్యానాయక్‌లకు ప్రచార సమయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ప్రజలు వారిని ప్రశ్నిస్తే.. తిరిగి ఈ అభ్యర్థులు సమాధానం చెప్పాల్సింది పోయి, ఆగ్రహం చూపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటర్లే దేవుళ్లు. కానీ బీఆర్ఎస్ నాయకుల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ప్రచారంలో పరుష పదజాలం ఉపయోగించి ప్రజలను కించపరుస్తున్నారు. ఇదంతా జనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఫ్రస్టేషన్‌ చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది.


డోర్నకల్ బీఆర్ఎస్ అభ్యర్థి డీఎస్ రెడ్యానాయక్‌
డోర్నకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి డీఎస్ రెడ్యానాయక్‌ తన నియోజకవర్గంలోని దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామంలో గురువారం ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ రెడ్యానాయక్ ఇలా అన్నారు. “మీకు సిగ్గు, శరం వుంటే సూర్యాపేటోనికి ఎట్లా ఓటు వేస్తారు.. నేను లోకల్ నాకే ఓటెయ్యాలి” అని పలుమార్లు ఓటర్లనుద్దేశించి అన్నారు.

ఇది విన్న ఓటర్లు ఒక్కసారిగా షాకయ్యారు. రెడ్యానాయక్ లాంటి ఒక సీనియర్ నాయకుడు బాధ్యత మరిచి ప్రవర్తించడంతో గ్రామస్తులు కూడా ఆయనపై మండిపడ్డారు. “మేము ఎవరికి ఓటు వేయాలో చెప్పడానికి నువ్వెవరు. మా ఊర్లో అభివృద్ధి చేసింది లేదు పైగా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా,” అంటూ ఆయనను ప్రశ్నించారు. రెడ్యానాయక్ కుమారుడు మానుకోట నుంచి పోటీచేస్తున్నారు. మరి ఆయన ఇల్లందు చెందిన వారు. అలాంటిది రెడ్యానాయక్ కుమారుడు వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే తప్పులేనిది, డోర్నకల్‌లో సూర్యపేటకు చెందినవారు పోటీ చేస్తే తప్పేముందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై కాంగ్రెస్ నాయకులు స్పందించారు. సూర్యపేటకు చెందిన రామచంద్రు నాయక్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తుంటే రెడ్యా నాయక్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, అందుకే ఆయన ప్రచారం కార్యక్రమంలో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థంకావడంలేదు అని ఎద్దేవా చేశారు.

.

.

.

మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

రెడ్యానాయక్‌లాగే మరో బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ప్రజలపై నోరు జారారు. మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటర్లను ఏకంగా పరుష పదజాలంతో సంబోధించాడు. ఓటర్లను ఊరకుక్కలు, పిచ్చికుక్కలు అంటూ రెచ్చిపోయారు. మిమ్మల్ని(ఓటర్లను) పండబెట్టి తొక్కాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మునుగోడు నియోజకవర్గం కొరటికల్ గ్రామంలో ప్రచారానికి వెళ్లిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని స్థానిక ప్రజలు నిలదీశారు. ఇదివరకు ఇచ్చిన హామీలు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. దీంతో ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా స్వరం పెంచి “ఊరకుక్కలు, పిచ్చికుక్కలు.. మిమ్మల్ని పండబెట్టి తొక్కాలి” అని ఆగ్రహం చూపించారు.

ఓట్లు వేసి గెలిపించే ఓటర్లు కుక్కలు అయితే కుక్కలకున్న విశ్వాసం ఏంటో చూపిస్తాం అని మునుగోడు ప్రజలు అంటున్నారు. ఓటర్లను పట్టించుకోని నేతలకు.. తమ సత్తా ఏమిటో ఎన్నికల వేళ తెలుస్తుందని స్థానిక ప్రజలన్నారు.

.

.

.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Big Stories

×