
Pakistan : పాకిస్థాన్ వరల్డ్ కప్ నుంచి ఇంటి ముఖం పట్టింది. ఆ జట్టు సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. ఇంగ్లండ్ మొదటి బ్యాటింగ్ కు దిగడంతో పాక్ కు సెమీస్ దారులు మూసుకుపోయాయి. కోల్ కతా ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ స్కోర్ 102 పరుగులు దాటగానే పాకిస్థాన్ అధికారంగా టోర్ని నుంచి వైదొలిగింది.
పాకిస్థాన్ సెమీస్ కు వెళ్లాలంటే 287 పరుగుల తేడాతో గెలవాలి. కానీ ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేయడంతో ఆ అవకాశం పాక్ లేకుండాపోయింది. ఒకవేళ ఇంగ్లాండ్ 101 పరుగుల టార్గెట్ ఇస్తే ఆ లక్ష్యాన్ని పాకిస్తాన్ 2.5 ఓవర్లలో ఛేదించాలి. అప్పుడు ప్రతి బంతికి సిక్స్ కొడితే పాక్ సెమీస్ కు వెళ్లేది.
టార్గెట్ 151 పరుగుల ఇంగ్లాండ్ ఇస్తే.. 3.4 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని చేధించాలి. కానీ ప్రతి బంతికి సిక్స్ కొట్టినా పాక్ స్కోర్ 132 పరుగుల వద్దే ఆగిపోతుంది. కానీ ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ సాధించింది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 6 ఓవర్లలోపే పాకిస్థాన్ ఛేదించాలి. ఇది సాధ్యం కాదు కాబట్టి పాకిస్థాన్ అధికారికంగా టోర్ని నుంచి వైదొలిగింది.
పాకిస్థాన్ కంటే మెరుగైన రన్ రేట్ ఉండటం వల్ల న్యూజిలాండ్ ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధంలేకుండా సెమీస్ కు చేరింది. 2019 మాదిరిగానే మరోసారి భారత్-న్యూజిలాండ్ సెమీస్ లో తలపడనున్నాయి.ఈ మ్యాచ్ ముంబైలో నవంబర్ 15 న జరుగుతుంది. రెండో సెమీస్ లో ఆస్ట్రేలియాతో సౌతాఫ్రికా తలపడుతుంది. ఈ మ్యాచ్ కోల్ కతా ఈడెన్ గార్డెన్ వేదికగా నవంబర్ 16 న జరుగుతుంది.