E-Paper
Advertisement

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ
Advertisement

Feel Good Road Trip Drama: ఒక బైక్‌పై ఇద్దరు అమ్మాయిలు… ముందున్న గమ్యం పుదుచ్చేరి. కానీ వాళ్ల ప్రయాణం వెనుక ఉన్న కారణాలు మాత్రం వేరు. ఒకరు కనిపించకుండా పోయిన తల్లి కోసం వెతుకుతుంటే… మరొకరు పెళ్లి వెనుక దాగిన నిజాన్ని తెలుసుకోవాలని బయలు దేరుతుంది. దారిలో ఎదురయ్యే మనుషులు, సమస్యలు, అనుభవాలు వాళ్లిద్దరినీ ఊహించని విధంగా దగ్గర చేస్తాయి. స్నేహం, స్వేచ్ఛ, సెల్ఫ్ డిస్కవరీతో సాగే ఫీల్‌గుడ్ రోడ్ ట్రిప్ డ్రామానే ‘హీర్ సారా’ (Heer Sara). మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు అంటే ?

కథలోకి వెళ్తే…

ఇండోర్‌ కు చెందిన హీర్, సారా ఇద్దరూ తమ తమ సమస్యలతో సతమతమవుతుంటారు. హీర్ చిన్నతనంలో తనను వదిలి వెళ్లిపోయిన తల్లి కోసం వెతుకుతుంటుంది. ఆమె ఎక్కడ ఉంది, ఎందుకు వెళ్లిపోయింది అనే విషయాలు తెలుసుకోవాలనేది హీర్ కోరిక. మరోవైపు సారా తన పెళ్లికి సంబంధించిన కొన్ని విషయాలపై అనుమానంతో ఉంటుంది. అసలు తన జీవితంలో జరుగుతున్నది ఏంటో తెలుసుకోవాలని ఆమె కూడా ప్రయత్నిస్తుంటుంది. ఈ ఇద్దరి దారులు అనుకోకుండా కలుస్తాయి. ఆ పరిచయం స్నేహంగా మారడంతో ఇద్దరూ కలిసి పుదుచ్చేరికి బైక్‌పై వెళ్లాలని నిర్ణయించుకుంటారు.

Advertisement

మొదట ఇది సాధారణ రోడ్ ట్రిప్‌లానే అనిపించినా… ప్రయాణం మొదలైన తర్వాత పరిస్థితులు మారిపోతాయి. దారిలో ఎదురయ్యే వ్యక్తులు, చిన్న చిన్న గొడవలు, సరదా సంఘటనలు వాళ్లిద్దరికీ కొత్త అనుభవాలను ఇస్తాయి. ప్రయాణం సాగుతున్న కొద్దీ హీర్, సారా ఒకరి సమస్యలను మరొకరు అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. కుటుంబం, పెళ్లి, వ్యక్తిగత స్వేచ్ఛ, తాము కోరుకున్న జీవితం… ఇలా ఎన్నో విషయాలపై వాళ్ల మధ్య చర్చలు జరుగుతాయి. తమ జీవితాల గురించి ఇంతకాలం తాము పట్టించుకోని కొన్ని విషయాలను కూడా ఆ ప్రయాణంలో గుర్తిస్తారు.

పుదుచ్చేరి చేరుకునే సరికి వాళ్లిద్దరి ప్రయాణం మరో మలుపు తీసుకుంటుంది. ముఖ్యంగా ఆరోవిల్‌లో కొన్ని విషయాలు బయట పడటంతో వాళ్ల అనుమానాలకు సమాధానాలు దొరకడం మొదలవుతుంది. అదే సమయంలో ఈ ప్రయాణం వాళ్లిద్దరికీ తమ జీవితాలపై కొత్త అవగాహనను ఇస్తుంది. చివరికి తాము ఏం కోరుకుంటున్నామో తెలుసుకోవడమే ఈ రోడ్ ట్రిప్‌లో అసలు ప్రయాణంగా మారుతుంది. మరి ఇంతకీ క్లైమాక్స్ లో ఏం జరిగింది ? వాళ్ళ లైఫ్ ఎలాంటి టర్న్ తిరిగింది ? వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిన నిజాలు తెలీషాయా ? అన్నది సినిమాలో చూడాల్సిందే.

ప్రైమ్ వీడియోలో రోడ్ ట్రిప్ మూవీ

Advertisement

‘హీర్ సారా’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా హిందీలోనే ఉంది. సెప్టెంబర్ 18 నుంచి ఓటీటీలోకి వచ్చింది. పత్రలేఖ (Patralekha), మాన్వి గాగ్రూ (Maanvi Gagroo), తారా బగారియా (Tara Bagaria), అరిఫ్ జకారియా (Arif Zakaria), శ్వేత్తా సాల్వే (Shvetta Salve) తదితరులు నటించిన ఈ మూవీకి కార్తిక్ చౌదరి (Kartik Chaudhry) దర్శకత్వం వహించారు. కార్తిక్ చౌదరి, మను శర్మ కథ, స్క్రీన్‌ప్లే అందించారు.

Read Also : మొగుడి మీద రివేంజ్ తీర్చుకోవడానికి ప్రియుడితో… ఈ కొరియన్ సిరీస్ లో ఒక్కో సీన్ ఉంటది భయ్యా

Related News

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

ఓటీటీలోకి 2 మలయాళం సినిమాలు… ఒకటి థ్రిల్లర్, మరొకటి ఫీల్‌గుడ్ మూవీ… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి ఈ వారం 14 కొత్త సినిమాలు, సిరీస్‌లు… తెలుగులోకి డబ్బింగ్ అయిన క్రేజీ మూవీస్ ఇవే

ఇరుముడి: థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఓటీటీలో విమర్శలు?

రికార్డ్ ధరకి ‘డ్రాగన్’ ఓటీటీ రైట్స్.. ఎన్ని కోట్లంటే?

Big Stories

Advertisement
×