E-Paper
Advertisement

ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ఇద్దరు మృతి!

ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ఇద్దరు మృతి!
Advertisement

ORR Crime: శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌పై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంక్చర్‌ అయిన వాహనానికి టైరు మారుస్తుండగా వెనుక నుంచి వచ్చిన టాటా లారీ ఢీకొట్టడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం..

వెనుక టైరు పంక్చర్‌..

చెంగుంట నుంచి స్క్రాప్‌ లోడ్‌తో అశోక్‌ లేలాండ్‌ వాహనం (TS 09 UD 3611) కీసర వైపు బయలుదేరింది. ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నంబర్‌ 6 నుంచి శామీర్‌పేట వైపు వెళ్లారు. లియోనియా ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి దాటిన తర్వాత సుమారు 300 మీటర్ల దూరంలో వాహనం కుడివైపు వెనుక టైరు పంక్చర్‌ కావడంతో అత్యవసర లేన్‌లో నిలిపారు. టైరు మార్చేందుకు రింకు, ఇబ్రహీం జాకీ రాడ్‌తో ప్రయత్నిస్తుండగా.. ఇస్మాయిల్‌ హుస్సేన్‌ వాహనం కింద టార్చ్‌ వెలుతురులో పనిచేస్తున్నాడు.

నిలిచి ఉన్న వాహనం..

Advertisement

అశోక్‌, భీమ్‌షా వాహనానికి ఆధారంగా ఉంచేందుకు రాళ్లు తెచ్చేందుకు వెళ్లారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన టాటా ట్రక్‌ (TS 15 UD 8932) నిలిపి ఉన్న అశోక్‌ లేలాండ్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో రింకు, ఇబ్రహీం, ఇస్మాయిల్‌ హుస్సేన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రింకు, ఇస్మాయిల్‌ హుస్సేన్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. ఇబ్రహీంను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మహ్మద్‌ హుస్సేన్‌..

ప్రమాదం అనంతరం టాటా ట్రక్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి పేరు నాగరాజుగా, మియాపూర్‌ వాసిగా భీమ్‌షా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడు ఇస్మాయిల్‌ సోదరుడు మహ్మద్‌ హుస్సేన్‌ ఫిర్యాదు మేరకు శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు, పరారైన డ్రైవర్‌ ఆచూకీపై పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Also read: విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

Tags

Related News

జన్వాడ ఫామ్‌హౌస్‌పై రాజకీయ దుమారం.. కేటీఆర్ పై ఎంపీ చామల ఫైర్!

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు చుక్కలు చూపిస్తాం: బండి సంజయ్‌

బిగ్ టీవీ ఇంపాక్ట్.. గుంతల వ్యవహారంలో సర్కార్ యాక్షన్.. మెట్రోకు నోటీసులు జారీ!

మహిళను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన హోంగార్డ్‌.. ఉద్యోగం నుంచి తొలగింపు

అవినీతి మరక లేని పాలన మోదీకే సాధ్యం.. రోజ్ గార్ మేళాలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

దోచుకోవడం.. దాచుకోవడమే కాంగ్రెస్, BRS నైజం! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

బిగ్ టీవీ దెబ్బకు మెట్రో కాంట్రాక్టర్లలో వణుకు.. రాత్రికి రాత్రి ఆగమేఘాలపై పిల్లర్ల గుంతలు పూడ్చివేత!

Big Stories

Advertisement
×