Turkish Drama: ఇస్తాంబుల్ లోని ఓ నైట్‌క్లబ్… అక్కడ కొన్నేళ్లుగా తిరుగులేని రాణిగా ఉన్న ఓ డ్యాన్సర్… అదే చోట కొత్తగా అడుగు పెట్టే యువతి. కొంతకాలనికే ఆమెను చెరదీసిన రాణికే పెంచుకున అమ్మాయి పోటీగా మారితే… అక్కడి నుంచి మొదలయ్యే పోరు కేవలం ఇద్దరు మహిళల మధ్య ఉండదు. ఇలాంటి అధికారం, పోటీ, ప్రతీకారం, సంఘీభావం వంటి అంశాల చుట్టూ తిరిగే టర్కిష్ డ్రామానే ‘సుల్తానా’ (Sultana). మరి ఈ మూవీ ఏ ఓటీటీలో తెలుగులో ఉందంటే?
ఇస్తాంబుల్ లోని ‘సుల్తానా’ క్లబ్ కు మెరాల్ గత కొన్నేళ్లుగా రాణిలా ఉంటుంది. ఆ క్లబ్ లో ఆమె మాటకు ప్రత్యేకమైన విలువ ఉంటుంది. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎవరి నుంచి ఎలాంటి సమస్య వస్తుందో ఆమెకు బాగా తెలుసు. అలాంటి సమయంలో బెలారస్ కు చెందిన యువ డ్యాన్సర్ అన్నా ఆ క్లబ్ లోకి వస్తుంది. కొత్తగా వచ్చిన అమ్మాయికి అక్కడి ప్రపంచం పూర్తిగా కొత్త. అన్నాలో ఉన్న ప్రతిభను గుర్తించిన మెరాల్ ఆమెను చేరదీస్తుంది. ఆమెకు ఈ ప్రపంచంలో ఎలా నిలబడాలో నేర్పిస్తుంది.
మొదట ఇద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంటుంది. అన్నా కూడా మెరాల్ ను గౌరవిస్తుంది. కానీ కొంతకాలానికి అన్నా ప్రతిభకు గుర్తింపు పెరుగుతుంది. క్లబ్ కు వచ్చే వాళ్ల దృష్టి కూడా ఆమెపై పడుతుంది. తనకు తెలియకుండానే అన్నా తన స్థానాన్ని ఆక్రమించే స్థాయికి ఎదుగుతోందని మెరాల్ గుర్తిస్తుంది. అక్కడి నుంచి ఇద్దరి మధ్య సంబంధం మారిపోతుంది. గురువు, శిష్యురాలి బంధం క్రమంగా పోటీగా మారుతుంది.
ఎవరి మాట నడవాలి, క్లబ్‌లో ఎవరి ఆధిపత్యం కొనసాగాలి అనే విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు పెరుగుతాయి. అయితే ఈ పోరాటంలో వాళ్లిద్దరూ మాత్రమే ఉండరు. క్లబ్ లో పని చేసే మిగతా మహిళలు కూడా ఒక్కో వైపు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరు ఎవరిని నమ్మాలి, ఎవరితో కలిసి నడవాలి అనే టెన్షన్ పెరుగుతుంది. మెరాల్ తన స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే… అన్నా కూడా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉండదు.
మహిళలను కేవలం బాధితులుగా కాకుండా తమ జీవితాల కోసం పోరాడే వ్యక్తులుగా చూపించే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇద్దరు మహిళల మధ్య పోటీతో పాటు వాళ్ల మధ్య ఏర్పడే అనుబంధం, ఒకరికొకరు అవసరమైన సందర్భాలు కూడా కథలో కీలకంగా మారతాయి. మరి ఇంతకీ చివరికి ఇద్దరిలో ఎవరి మాట నెగ్గింది ? ఆ క్లబ్ అధికారం ఎవరికి దక్కింది ? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమాను డోంట్ మిస్.
‘సుల్తానా’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులోకి వచ్చింది. అసలు ఆడియో టర్కిష్ కాగా, ఇంగ్లీష్ ఆడియోతో పాటు తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో ఉంది.
Read Also: ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ