Passport Centre: దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఓ మెట్రో స్టేషన్ లో ఆధునిక పాస్ పోర్ట్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక రోజుకు వేల స్లాట్లతో సేవలు అందుబాటులోకి రానున్నాయి. భాగ్య నగరంలోని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లో నూతన పాస్ పోర్ట్ కార్యాలయాన్ని మంతరి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, అనిల్ కుమార్ యాదవ్ లు ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటి వరకు అమీర్ పేట ఆదిత్య ట్రేడ్ సెంటర్ లో సేవలు అందించిన పాస్ పోర్ట్ కేంద్రాన్ని ప్రస్తుతం ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ కు తరలించి ఆధునీకరించి అందుబాటులోకి తెచ్చామని మంత్రి పొన్నం తెలిపారు. టోలి చౌకీ, షేక్ పేట వద్ద ఉన్న కేంద్రాన్ని రాయదుర్గం ఓల్డ్ ముంబై రోడ్డు సిరి బిల్డింగులోకి మార్చామని చెప్పారు. దేశంలో హైదరాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయం ఐదో స్థానంలో ఉందని అన్నారు. ఎంజీబీఎస్, రాయదుర్గం, నిజామాబాద్, కరీనంగర్ ప్రాంతాల్లో రాష్ట్రంలో పాస్ పోర్ట్ సెంటర్లు ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఒక రోజుకి 4500 పాస్ పోర్ట్ లు ఇచ్చే కెపాసిటీ ఉందని.. దీన్ని 5000 స్లాట్లకు పెంచుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
ఎంజీబీఎస్ సెంటర్ లో రోజుకు 700 స్లాట్స్ ఉన్నాయని.. దీన్ని 1200 స్టాట్స్ కు పెంచాలని అన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ ప్రారంభించిన పాస్ పోర్ట్ సెంటరలో 250 స్టాట్స్ ఉన్నాయిన.. దీనిని 500 పెంచుకోవాలని చెప్పారు. మొత్తం రాష్ట్రంలో 5000 స్లాట్స్ దాటేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొన్నం సూచించారు. ఆధార్ కార్డు మాదిరి ప్రతి ఒక్కరు పాస్ పోర్ట్ తీసుకోవాలని అన్నారు.
గతంలో గల్ఫ్ దేశాలకు కార్మికుల మాదిరి విదేశాలకు వెళ్లేని.. అదే ఇప్పుడు విద్యా, ఉపాధి అవకాశాలు నిమిత్తం విదేశాలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. అలాగే టూరిజం కోసం విదేశాలకు వెళ్తున్నారని అన్నారు. భారతీయుడిగా గుర్తింపు ఉండడానికి ప్రతి ఒక్కరూ పాస్ పోర్ట్ తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ALSO READ: Rajendranagar: హైదరాబాద్‌లో దారుణ ఘటన.. కుళ్లిపోయిన స్థితిలో మహిళ డెడ్ బాడీ లభ్యం