Weather News: రాబోయే రెండు, మూడు రోజుల పాటు హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. భాగ్యనగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్ గత మూడు, నాలుగు రోజుల నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. రెండు రోజుల క్రితం ముషీరాబాద్, సికింద్రాబాద్, నారాయణగూడ, రాం నగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అయితే, ఇప్పుడు వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మరోసారి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావం వల్ల ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి వంటి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఇవాళ హైదరాబాద్ నగరం, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. హైదరాబాద్ మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. సాయంత్రం నుంచి రాత్రంతా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
కాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వానలు
మరి కాసేపట్లో (రాబోయే 2 గంటల్లో).. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అధికారులు కీలక సూచనలు..
ఈ వర్షాల వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే, ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు గొడుగులు తీసుకోవడం, నీరు నిలిచిన ప్రాంతాల వైపు వెళ్లకపోవడం, అత్యవసర సందర్భాల్లో అధికారుల సహాయం తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.
ALSO READ: IOCL Jobs: పదో తరగతి అర్హతతో భారీగా జాబ్స్.. మంచి వేతనం.. 2 రోజులే గడువు
పిడుగులు పడే ఛాన్స్..
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.. డ్రైనేజీ వ్యవస్థలను సిద్ధం చేయడం, అత్యవసర సేవల బృందాలను అప్రమత్తం చేయడం జరుగుతోంది. ప్రజలు కూడా వాతావరణ నివేదికలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. మొత్తంగా, హైదరాబాద్‌లో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని., అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
ALSO READ: Rajendranagar: హైదరాబాద్‌లో దారుణ ఘటన.. కుళ్లిపోయిన స్థితిలో మహిళ డెడ్ బాడీ లభ్యం