IND VS PAK : ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వకపోవడంతో పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఐసీసీ మాత్రం ఈ విషయంలో ఆటగాళ్ల ఇష్టం అని టీమిండియాకే మద్దతు తెలిపింది. ఇదిలా ఉండగానే టీమిండియా దిగ్గజ ఆటగాడు, మాస్టర్ బ్లాస్టర్, సచిన్ టెండూల్కర్ వీరాభిమాని పాకిస్తాన్ ఫ్యాన్స్ ని కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓవైపు ఆటగాళ్లు షేక్ హ్యండ్ ఇవ్వలేదని బాధపడుతుంటే.. ఈ అభిమాని ఇలా చేశాడేంట్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Also Read : IND Vs PAK : దొంగ చాటున షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఇప్పుడు సూర్య నీతులు చెబుతున్నాడు.. ఫ్యాన్స్ సీరియస్ !
మరోవైపు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్ జరుగకముందే పాకిస్తాన్ ఆటగాళ్లను కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వడం వైరల్ అయింది. దీనిపై ట్రోలింగ్స్ చేశారు నెటిజన్లు. భారత్ లోని పహల్గామ్ లో పాకిస్తాన్ చెందిన ఉగ్రవాదులు దాడులు చేయడంతో 26 మంది భారతీయ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.దీంతో భారత సైనికులు దానికి ప్రతీ కారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేపట్టింది. అయితే పాకిస్తాన్ వారు భారత్ కి చెందిన అమాయక ప్రజలను చంపుతారు. దుబాయ్ లో మళ్లీ వారితో భారతీయులు కరచాలం చేస్తున్నారని అటు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. కి, అలాగే సచిన్ టెండూల్కర్ అభిమాని సుధీర్ కుమార్ పై సంచలన కామెంట్స్ చేశారు.
సచిన్ టెండూల్కర్ కి కోట్లాది మంది అభిమానులున్నారు. అయితే ఎంత మంది అభిమానులు ఉన్నా సుధీర్ కుమార్ మాత్రం చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. ఒళ్లంతా త్రివర్ణ రంగులను పూసుకొని చేతిలో జెండా పట్టుకొని సందడి చేసే వ్యక్తి సుధీర్ కుమార్ చౌదరీ. సుధీర్ కుమార్ సచిన్ రిటైర్మెంట్ అయ్యేంత వరకు ప్రతీ మ్యాచ్ లో కూడా స్టాండ్స్ లో కనిపించేవారు. సచిన్ఆడిన ప్రతీ మ్యాచ్ ను చూసేందుకు ఆస్తులను సైతం అమ్ముకున్నాడు. శరీరాన్ని మొత్తం భారతీయ జెండాలోని త్రివర్ణ రంగులతో నింపుకొని చాతీపై సచిన్ టెండూల్కర్ జెర్సీ నెంబర్ ముద్రించుకొని చేతిలో జాతీయ జెండాను పట్టుకొని టీమిండియా ఎక్కడ మ్యాచ్ లు ఆడితే అక్కడికీ సైకిల్ పైనే వెళ్లి మ్యాచ్ లను చూసేవాడు. అలా చాలా ఫేమస్ అయ్యాడు సుధీర్ కుమార్. 2011 ఏప్రిల్ 02న టీమిండియా వన్డే వరల్డ్ కప్ విజయం సాధించిన రోజు భారత డ్రెస్సింగ్ లో రూమ్ లో సంబురాలకు సుధీర్ చౌదరీని ఆహ్వానించి గౌరవించాడు సచిన్ టెండూల్కర్.