Rajendranagar News: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్ పురాలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్థానికులకు మహిళ డెడ్ బాడీ కనిపించింది. దీంతో స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన మహిళ ఎవరు.? ఆత్మహత్యకు పాల్పడిందా..? లేదా హత్య చేసి ఇక్కడ పడేశారా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసు అధికారులు మీడియాతో కీలక విషయాలు వెల్లడించారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే సంఘటనా స్థలానికి వచ్చామని పోలీసులు తెలిపారు. డెడ్ బాడీని మహిళా డెడ్ బాడీగా గుర్తించామని అన్నారు. ఎక్కడో హత్య చేసి కిస్మత్ పురలో పడవేసినట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. డెడ్ బాడీ కుళ్ళిన స్థితిలో ఉందని.. హత్య జరిగి రెండు మూడు రోజులు అయి ఉండొచ్చని చెప్పారు. మృతురాలి వయసు 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఉంటుందని పేర్కొన్నారు. రేప్ చేసి బ్రిడ్జిపై నుంచి కింద పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: ADE Ambedkar: అవినీతి అనకొండ.. గచ్చిబౌలి, కొండాపూర్‌లో భారీగా అస్తులు గుర్తింపు
డెడ్ బాడీ దొరికిన ప్రాంతానికి సమీపంలో సీసీ కెమెరాలు ఉన్నాయని.. వాటిని వెరిఫై చేస్తున్నామని అన్నారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు అనుమానిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నామని వివరించారు. సమీప పోలీస్ స్టేషన్లలో ఏవైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా..? అని కూడా విచారిస్తున్నామని తెలిపారు. ఘటనా స్థలంలో క్లూస్, అలానే ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తున్నామని అన్నారు. మృతురాలు ఎవరు..? ఆమెను హత్య చేసింది ఎవరు..? అన్నది త్వరలోనే తేలుస్తామని పోలీసులు అధికారులు వెల్లడించారు.
ALSO READ: CM Revanth Reddy: అంధ విద్యార్ధులకు సర్కార్ చేయూత.. వాయిద్య పరికరాలు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి