BigTV English

Telangana: నీటి సరఫరా పర్యవేక్షణ.. 10 మంది ఐఏఎస్‌లను నియమించిన ప్రభుత్వం..

Telangana: నీటి సరఫరా పర్యవేక్షణ.. 10 మంది ఐఏఎస్‌లను నియమించిన ప్రభుత్వం..
Telangana Government
Telangana Chief Secretary Shanthi Kumari

Telangana Government: తాగు నీటి సరఫరా పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. 33 జిల్లాకు పది మంది ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


తెలంగాణలో తాగు నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. సరఫరా సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని. జులై చివరి వారం వరకు అధికారులెవరూ సెలవులు పెట్టకూడదని ఆదేశించింది.

ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ప్రశాంత్ జివన్ పాటిల్, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు కృష్ణాదిత్యా, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆర్ వి కర్ణన్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు అనితా రామచంద్రన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు శరత్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు విజేంద్ర, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు శృతి ఓఝా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు బి. గోపీ, ఉమ్మడి మెదక్ జిల్లాకు భారతీ హోలీకేరి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సురేంద్ర మోహన్‌ను నియమిస్తూ తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.


 

Telangana Government

Tags

Related News

Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన

Komatireddy Rajagopalreddy: హమ్మయ్య..! రాజగోపాల్ రెడ్డి ఇగో చల్లారినట్టేనా?

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Big Stories

×