Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం యువతకు శుభవార్త చెప్పింది. కేవలం ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా యువత స్వయం ఉపాధి కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం’ స్కీమ్ ను అమలు చేయనుంది. ఈ స్కీమ్‌లో భాగంగా యువతకు రుణాలు మంజూరు చేయనుంది.
తెలంగాణ యువతకు కొత్త స్కీమ్
యువత కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కోసం రుణాలను మంజూరు చేయనుంది. ఇందుకోసం రాజీవ్ యువ వికాసాన్ని పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.ఈ ప్రక్రియ మార్చి 17వ నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దాదాపు 5 లక్షల మంది యువతకు రూ.6 వేల కోట్ల ఖర్చుతో ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ కార్పొరేషన్లు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చాయి. రాజీవ్ యువ వికాసం పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు రూ.3 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించింది.
ఎస్టీ, ఎస్సీ, బీసీ యువతకు
ఈ పథకానికి అర్హతలు, ఎంపిక వివరాలు https://tgobmms.cgg.gov.in/ పోర్టల్‌లో పొందుపరిచింది. ఈ విషయాన్ని బీసీ కార్పొరేషన్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు తెలుసుకోవాల్సినవారు సంక్షేమశాఖల జిల్లా అధికారులు, కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను సంప్రదించాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే గిరిజనులు ఐటీడీఏ అధికారుల్ని సంప్రదించాలని గిరిజన సహకార ఆర్థిక సంస్థ పేర్కొంది.
ALSO READ: మళ్లీ నేనే ముఖ్యమంత్రి
రుణాల్లో రాయితీలు కూడా
యువత దరఖాస్తు చేసిన వాటిని ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు పరిశీలన కొనసాగు తుంది. ఎంపికైన లబ్ధిదారులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు(జూన్ 2న) ఈ పథకానికి సంబంధించి రుణాల మంజూరు పత్రాలను ప్రభుత్వం అందజేయనుంది. రాజీవ్ యువ వికాసం స్కీమ్‌లో మూడు కేటగిరీ ఉంటాయి. 1, 2, 3 వారీగా రుణాలు ఖరారు చేయనుంది ప్రభుత్వం.
కేటగిరీ-1 కింద రూ.లక్ష వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఇందులో 80 శాతం రాయితీ ఉంటుంది. కేవలం 20 శాతం లబ్ధిదారు భరించడం లేదా బ్యాంకు అనుసంధానం యూనిట్లు కేటాయిస్తారు. కేటగిరీ 2 కింద రూ.లక్ష రూపాయల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. ఇందులో 70 శాతం వరకు రాయితీ ఉంటుంది. కేటగిరీ-3 కింద రూ.3 లక్షల లోపు రుణాలు ఇస్తారు. కాకపోతే 60 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది.