Gundeninda GudiGantalu Today episode march 16th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు చేతికి గాయం తగిలినట్టు మీనా గమనిస్తుంది.. ఇది చిన్న గాయమని మీరంటున్నారు కానీ ఇది చాలా పెద్దగాయమండి అని అనగానే నాకు అస్సలు ఓపిక లేదు నేను వెళ్లి ఫ్రెష్ అవుతాను.. నాకు అన్నం తీసుకురావని మీ నాకు చెప్పి బాలు లోపలికి వెళ్ళిపోతాడు. చెయ్యి నొప్పితో బాధపడుతున్న బాలుకు మీనా అన్నం తినిపిస్తుంది. మీరు చెల్లెలు కోసం ఎంత చేస్తున్నారు? రేపు ఎవరైనా ఏదైనా అంటే మీరు కోపంతో రెచ్చిపోతారు. అది మాత్రం తగ్గించుకోండి అని మీనా అంటుంది. భార్య చెప్తే వినకుండా ఉంటారా అని బాలు సెటైర్ వేస్తాడు. అటు సత్యం బాలుకి విషయాన్ని ఎలా చెప్పాలని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మాత్రం మీ కొడుకు మీద ప్రేమ పొంగు కొచ్చింది కదా మరి మౌనిక ఫంక్షన్ ఆపేద్దామా వాళ్ళ అసలు ఒప్పుకోరు కదండీ మీరు ఏదైనా ఆలోచించాలి కదా అంటూ సత్యం కు చెబుతుంది. మీనా భర్త పై ప్రేమతో అన్నం తినిపిస్తుంది. తన పై మీనా చూపిస్తున్న ప్రేమకు ఉప్పొంగి పోతాడు బాలు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికోస్తే.. మౌనిక ఫంక్షన్‌లో ఉండొద్దని బాలుకు ఎలా చెప్పాలో తెలియక ఆలోచనలో పడతాడు సత్యం. బాలు ఉండటం వల్ల తలెత్తే అనార్థాలేమిటో చెబితే సరిపోతుంది అంటూ తేలిగ్గా మాట్లాడుతుంది ప్రభావతి. బాలు విషయంలో నువ్వు ఉన్నంత కఠువుగా నేను ఉండలేనని సత్య బదులిస్తాడు. బాలుతో నేనే మాట్లాడుతానని ప్రభావతి అంటుంది. అక్కరలేదని సత్యం సమాధానమిస్తాడు.. మీకు మౌనిక ఫంక్షన్ జరగాలంటే మాత్రం బాలు ఇంట్లో ఉండకూడదు అని సమాధానం ఇస్తుంది. సత్యం మాత్రం ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు. అటు మీనా భర్తను ప్రేమగా చూసుకుంటుంది. బాలు చెల్లెలి ఫంక్షన్ దగ్గరుండి అన్నీ చూసుకోవాలని హడావుడి చేస్తాడు. పెళ్లి కొడుకులాగా ముస్తాబు అయ్యి తొందరగా పనులు కావాలని హడావిడిగా ఉంటాడు. రవిని ఈ క్రమంలో ఒక ఆట ఆడుకుంటాడు.
రవిని లేచిపోయినోడా నువ్వు వంటవాడివే కదా మీ వదినకి సాయం చేయొచ్చు కదా అని అనగానే. నువ్వు నల్ల బీమా అని నన్ను ప్రేమగా పిలిస్తే నేను వదినకు ఖచ్చితంగా సాయం చేస్తాను అంటాడు. కానీ బాలు మాత్రం మీనా ఈ వంట పని నువ్వే కష్టపడి ఎలాగోలాగా పూర్తి చేయు వీడిని మాత్రం నేను నల్ల బీమా అని పిలిచేది లేదు అంటూ సరదాగా మాట్లాడుతాడు. ఇక ఆ తర్వాత పొద్దున్నే ఏంట్రా నీ హడావిడి అని బాలును మనోజ్ అంటాడు. లక్షలు మింగినోడా చెల్లెలి కోసం చేస్తున్న ఫంక్షన్ లో నువ్వు ఉండకూడదు. జాబ్ లేదని పార్క్ ఉంటున్నావు అని తెలిస్తే మా పరువు పోతుందని అంటాడు. అటు రోహిణి మనోజ్ ను ఏదైనా అంటే బాగోదు అని వార్నింగ్ ఇస్తుంది. అయిన బాలు మాత్రం పంచులు వెయ్యకుండా ఆగడు.
మంగళసూత్రాన్ని ఆర్డర్ ఇచ్చాను ఈ రాజేష్ గాడు తీసుకొచ్చాడో లేదో అంటూ బాలు హడావిడిగా అందరిపై అరుస్తూ ఉంటాడు. బాలు ఎంతో సంతోషంగా మిగిలిన పనులన్నీ చేస్తున్నాడు. పంచె, ఎర్రచొక్కాలో హుందాగా రెడీ అయ్యి సందడి చేస్తూ ఉంటాడు. ఎప్పటిలాగే ఇంట్లో వాళ్లమీద పంచులు వేస్తూనే నవ్వులు పూయిస్తాడు. అయితే మౌనికా వాళ్ల అత్తగారు బాలును ఫంక్షన్ లో ఉండొద్దనే కండీషన్ పెట్టినా.. సత్యం మాత్రం కన్నకొడుకుకు ఎలా చెప్పాలో తెలియక, చెప్పలేక గమ్మునుండిపోతాడు.. అని ప్రభావతి మాత్రం నువ్వు వెంటనే వెళ్లి ఒక పూజ చేయాలి అది కూడా కాకినాడకు వెళ్లి పూజ చేయించాలి. ఇప్పుడు అర్జంట్ నా ఫంక్షన్ అయ్యాక వెళ్తాను అని అంటాడు. కానీ ప్రభావతి మాత్రం నువ్వు ఈ ఫంక్షన్ లో ఉండకూడదు.. ఉంటే ఫంక్షన్ జరగదు అని అంటారు. కానీ బాలు మాత్రం మౌనిక ఫంక్షన్ కు నేను లేకుండా ఎలా ఉండను అంటాడు. ఆ విన్న సత్యం మాత్రం నువ్వు వెళ్ళాలి రా అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..