BigTV English
Advertisement

Railway Tickets: అయ్య బాబోయ్.. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునే వాళ్లు అంత మందా?

Railway Tickets: అయ్య బాబోయ్.. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునే వాళ్లు అంత మందా?

Indian Railways: భారతీయ రైల్వే రోజు రోజుకు మరింత అప్ డేట్ అవుతోంది. అత్యాధునిక రైళ్ల నుంచి టికెట్ల అమ్మకాల వరకు అంతా మారిపోయింది. ముఖ్యంగా టికెట్ల విక్రయాల్లో విప్లవవాత్మక మార్పులు వచ్చాయి. గతంలో టికెట్ల కోసం ప్రయాణీకులు కౌంటర్ల దగ్గర నిలబడే వాళ్లు. ఏ కౌంటర్ దగ్గర చూసినా పెద్ద పెద్ద క్యూలు కనిపించేవి. పోటీపడి మరీ టికెట్లు కొనుగోలు చేసే వాళ్లు. కానీ, ఇప్పుడు అంతా డిజిటల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఆన్ లైన్ ద్వారా ఈజీగా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే, ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోడం కాస్త ఖరీదైనది. కౌంటర్ టికెట్లతో పోల్చితే ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వాళ్లు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.


80 శాతం టికెట్లు ఆన్ లైన్ ద్వారానే బుకింగ్

ఖరీదు అయినప్పటికీ ప్రయాణీకులు అత్యధిక సంఖ్యలో ఆన్ లైన్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ప్రస్తుత ప్రయాణీకులలో సుమారు 80 శాతం మంది IRCTC ద్వారానే ఆన్ లైన్ టికెట్లు బుక్ చేసుకుంటున్నట్లు కేంద్రరైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఆన్ లైన్ విధానం ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా ప్రయాణీకులు తమ సమయాన్ని ఆదా చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉందన్నారు. ఈ విధానం ద్వారా ప్రయాణీకులు తమ టికెట్ ఖర్చులను తగ్గించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆన్ లైన్ టికెట్ విధానం ద్వారా భారతీయ రైల్వే సంస్థకు పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నట్లు వివవరించారు.


ఆన్ లైన్ టికెట్ల ధర ఎక్కువ ఎందుకంటే?

వాస్తవానికి కౌంటర్ టికెట్లతో పోల్చితే, ఆన్ లైన్ టికెట్ల ధరలు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆన్ లైన్ టికెట్లను ఎక్కువ మంది IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ద్వారా బుక్ చేసుకుంటారు. భారతీయ రైల్వే అధికారిక వెబ్ సైట్ కావడంతో టికెట్ల బుకింగ్ కు చాలా మంది ఇదే సైట్ ను ఆశ్రయిస్తారు. ఇందులో ఈజీగా టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈ సౌకర్యాన్ని అందించేందుకు IRCTCకి చాలా ఖర్చు అవుతుంది.  సాఫ్ట్‌ వేర్ అప్ డేట్, వెబ్‌ సైట్ మెయింటెనెన్స్, సర్వర్ పరిధి విస్తరణ, భద్రతా చర్యల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంది. ఈ ఖర్చులు అన్నీ పూడ్చుకునేందుకు IRCTC కన్వీనెన్స్ ఫీజు వసూళు చేస్తుంది. అందుకే ఆఫ్ లైన్ తో పోల్చితే, ఆన్ లైన్ లో టికెట్ల ధర ఎక్కువగా ఉంటుంది.

Read Also: ఆ సబ్సిడీల జోలికి వెళ్లకండి, పార్లమెంటరీ ప్యానెల్ కీలక సిఫార్సులు!

ప్రయాణీకులకు, ప్రభుత్వానికి లాభం

ఆన్ లైన్ టికెట్ల ద్వారా ప్రయాణీకులతో పాటు ప్రభుత్వానికి లాభం కలుగుతుంది. టికెట్ల బుకింగ్ మీద జీఎస్టీ విధిస్తారు. ఈ మొత్తం భారత ప్రభుత్వానికి చేరుతుంది. జీఎస్టీ కారణంగానూ ఆన్ లైన్ టికెట్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. అయితే, ప్రయాణీకులకు కూడా ఈజీగా టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు సమయాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.

Read Also: వైజాగ్ వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్, రెండు రోజుల పాటు ప్రత్యేక రైళ్లు!

Related News

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

IRCTC Packages: రామేశ్వరం నుంచి అయోధ్య వరకు.. భారత గౌరవ్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర

Shocking Video: ఎక్కువ ధర ఎందుకన్న ప్రయాణీకుడు, చితక బాదిన క్యాటరింగ్ సిబ్బంది, వీడియో వైరల్!

Vande Bharat Trains: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాలకు?

Nashik Tour: నాసిక్ టూర్.. ఈ ప్లేస్‌లు జీవితంలో ఒక్కసారైనా చూడాలి మావా !

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 60 ప్రత్యేక రైళ్లు!

Bangalore Tour: బెంగళూరు టూర్.. ఈ ప్రదేశాలు ఒక్కసారైనా చూడాల్సిందే !

Big Stories

×