CM Revanth Reddy: రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిని అవుతానని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు.
తొలి సారి బీఆర్ఎస్ పై వ్యతిరేకితతో తమకు ఓటేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రెండోసారి తమపై ప్రేమతో ప్రజలు ఓటేస్తారని అన్నారు. సంక్షేమ పథకాల లబ్దిదారులే తమ ఓటర్లు అని చెప్పుకొచ్చారు. తాను పనిని నమ్ముకుని ముందుకు వెళ్తున్నానని పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను చెప్పిందే జరిగింది. తర్వాత కూడా నేను చెప్పిందే జరుగుతుంది. ఇచ్చిన హామీ ప్రకారం కచ్చితంగా కోటి మంది మహిళలకు లబ్ది చేకూరుస్తాం. మా పని మీద ధైర్యంతో ముందుకెళ్తున్నాం. ఇప్పటి వరకు 25లక్షల మందికి రుణమాఫీ జరిగింది. డీలిమిటేషన్ కు కేంద్రం సిద్ధం అవుతోంది. దక్షిణాదికి అన్యాయం జరగకుండా మా ప్రయత్నం మేం చేస్తున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. వీలైనంత త్వరలో కేటీఆర్ దుబాయ్ ఫైల్స్ రహస్యం బయటపెడతాం అని చెప్పారు. అప్పట్లో జన్వాడ ఫాం హౌస్ డ్రగ్స్ పార్టీలో ఎవరు దొరికారని ప్రశ్నించారు. ఇటీవల కాలంలో మొయినాబాద్ ఫాంహౌస్ లో జరిగిన కోడి పందేలు, క్యాసినోలో ఎవరు దొరికారో ప్రజలకు అన్ని తెలుసనని చెప్పారు. దుబాయిలో చనిపోయిన వ్యక్తి ఎవరికి మిత్రుడని.. డెడ్ బాడీని సొంత రాష్ట్రానికి తీసుకురాకుండా.. దుబాయ్ కి వెళ్లి మరీ అంత్యక్రియలు చేయంచి వచ్చిన చరిత్ర ఎవరిదో అందిరికీ తెలుసనని సీఎం రేవంత రెడ్డి చెప్పుకొచ్చారు.
ALSO READ: NCL Recruitment: సువర్ణవకాశం.. పదో తరగతి అర్హతతో 1765 పోస్టులు, ఇంకా 3 రోజులే గడువు..