BigTV English

Formula E Racing Scam: హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ స్కామ్.. రంగంలోకి ఏసీబీ!

Formula E Racing Scam: హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ స్కామ్.. రంగంలోకి ఏసీబీ!

Formula E Racing Scam: బీఆర్ఎస్ నేతలు కష్టాలు వెంటాడుతున్నాయి. గడిచిన పదేళ్లలో చేసిన అవకతవకలపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. లేటెస్ట్‌గా హైదరాబాద్‌ లో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది.


నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల రూపాయలను విదేశీ సంస్థకు ముట్టజెప్పారంటూ మున్సిపల్ అధికారులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఈ యవ్వారం వెలుగులోకి వచ్చింది. దీంతో గత పాలకుల చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లయ్యింది.

హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేస్ నిర్వహణపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పుకుంది. ఆ తరహా రేస్ దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉందని, అందులో హైదరాబాద్ ఒకటని ఢంకా బజాయించింది.


ఈ రేసు వెసుక అసలు వాస్తవాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. లేటెస్ట్‌గా ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు చెల్లించినట్లు మున్సిపల్ అధికారులు తేల్చారు. దీనిపై విచారణ జరపాలంటూ అధికారులు ఏసీబీకి లెటర్ రాయడంతో బీఆర్ఎస్ నేతలకు టెన్షన్ మొదలైంది.

ALSO READ: నవంబర్ ఐదు.. తెలంగాణకు రాహుల్‌గాంధీ

గతేడాది హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ఫార్ములా ఈ-రేస్ జరిగింది. ఈ రేస్ కోసం దాదాపు మూడు కిలోమీటర్ల మేరా ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేశారు. తొలి రేస్ సక్సెస్ కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఫార్ములా ఈ-రేస్ నిర్వాహకులతో పట్టణాభివృద్ధి సంస్థ డీల్ కుదుర్చుకుంది.

ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల రూపాయలను ఆ సంస్థకు చెల్లించింది. ఈ వ్యవహారమంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. గత డిసెంబర్‌లో తెలంగాణలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

ఒప్పందంలోని అంశాలు పాటించకపోవడం వల్ల హైదరాబాద్‌లో నిర్వహించాల్సిన ఫార్ములా ఈ- రేస్ నుంచి తప్పుకుంటున్నామని గత డిసెంబర్‌లో నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ఈ ఏడాది జరగాల్సిన రేసు ఆగిపోయింది.

పద్దతి ప్రకారం.. హెచ్ఎండీఏ బోర్డు సభ్యులతోపాటు ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్న తర్వాత ఫార్ములా నిర్వహణ సంస్థకు నిధులు చెల్లించాలి. అలాంటిదేమీ జరక్కుండానే నేరుగా నిధులను ఆ సంస్థకు ఇచ్చేశారు.

విదేశీ సంస్థకు నిధులు చెల్లింపులు జరిపేటప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. అవేమీ పట్టించుకోలేదు అప్పటి అధికారులు. దీనిపై అప్పటి అధికారులకు ప్రభుత్వం మెమో జారీ చేసింది. ప్రక్రియ వేగంగా జరగాలనే ఉద్దేశంతో చెల్లింపులు జరిపామన్నది అధికారుల వెర్షన్.

ఈ వ్యవహారమంతా పురపాలక శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ శాఖకు మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని మున్సిపల్ అధికారులు ఏసీబీ లేఖ రాయడంతో బీఆర్ఎస్ వెన్నులో వణుకు మొదలైంది. ప్రభుత్వం రేస్ స్కామ్ వ్యవహారాన్ని ఏసీబీకి ఇస్తుందా? లేదా సీఐడీకి ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

Related News

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Big Stories

×