Telangana Group 2 exams: తెలంగాణలో గ్రూప్- 2 పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. డిసెంబర్ 15న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ -1 పరీక్ష నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 ఉంటుందని ప్రకటించింది. అదేవిధంగా డిసెంబర్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 5.30 గంటల వరకు పేపర్- 4 పరీక్ష నిర్వహిస్తారు.
ప్రతి పేపర్ లో 150 ప్రశ్నలు ఉండగా 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. అంతే మొత్తం నాలుగు పేపర్లకు కలిపి 600 మార్కులు ఉండనున్నాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అరగంట ముందే 9.30 నిమిషాలకు పరీక్ష కేంద్రంలో ఉండాలి. ఆ తరవాత నిమిషం ఆలస్యం అయినా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరు. మరోవైపు ఇప్పటికే గ్రూప్-2 హాట్ టికెట్లను డిసెంబర్ 9వ తేదీ నుండి అందుబాటులో ఉంచుతున్నట్టు టీజీ పీఎస్సీ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 783 పోస్టులను భర్తీ చేయనున్నారు. 5.51 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు అప్లై చేసుకున్నారు.