BigTV English

Pushpa 2: శ్రీలీల కిస్సిక్ వస్తుంది.. ఇండస్ట్రీ మొత్తం ఊగిపోవడానికి సిద్ధంగా ఉండాలమ్మా

Pushpa 2: శ్రీలీల కిస్సిక్ వస్తుంది.. ఇండస్ట్రీ మొత్తం ఊగిపోవడానికి సిద్ధంగా ఉండాలమ్మా

Pushpa 2: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2. సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఇండియాస్‌ ఫేమస్‌ ప్రొడ్యూసర్స్‌ నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిన బన్నీ.. ఇప్పుడు పుష్ప 2 తో గ్లోబల్ హీరోగా మారాలనుకుంటున్నాడు బన్నీ.


ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం.. ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేసింది. ఎప్పటి నుంచి ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఎవరు చేస్తున్నారు అని పెద్ద చర్చనే సాగింది.

Sankranthi Movies: 2019 రిపీట్ అయితే.. ఈసారి కూడా వెంకీ మామనే విన్నర్.. ?


ఇక చివరికి ఆ సాంగ్  అందాల భామ శ్రీలీల చేతికి చిక్కింది.  ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీలపై చిత్రీకరించిన కిస్సిక్  అంటూ సాగే పాటను ఈ నెల 24న చెన్నయ్‌లో జరగనున్న గ్రాండ్‌ ఈవెంట్‌లో  ఏడు గంటల రెండు నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఒకవైపు ఐకాన్‌ స్టార్‌ డ్యాన్సుల గురించి, డ్యాన్సుల్లో ఆయన ఎనర్జీ, ఈజ్‌, స్టయిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరో వైపు డ్యాన్సుల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న కథానాయిక శ్రీలీల ఈకాంబోలో ప్రత్యేక గీతం అంటే ఇక ఫ్లోర్‌ ఫైరే… ఈ సాంగ్‌ పుష్ప-2లో మరో సన్సేషన్‌ సాంగ్‌గా నిలవబోతుందని తెలుస్తోంది.

Amitabh Bachchan: ఐష్ – అభిషేక్ విడాకులు.. తొలిసారి స్పందించిన బిగ్ బీ..!

ఇక ఈ పోస్టర్ లో కూడా శ్రీలీల.. అల్లు అర్జున్ థైస్ పై పడుకొని ఉండడం మరింత హైప్ ను క్రియేట్ చేసింది. పుష్ప లో సమంత ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అంటూ సెన్సేషన్ సృష్టించిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు శ్రీలీల కిస్సిక్ అంటూ మరోసారి ఇండస్ట్రీని ఊపేయడానికి రెడీ అయ్యింది. మరి ఈ సాంగ్ తో అమ్మడి రేంజ్ ఏ రేంజ్ కు మారుతుందో చూడాలి.

 

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×