Chevella Bus Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. డీజీపీతో ఫోన్‌లో మాట్లాడారు ముఖ్యమంత్రి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగించా లన్నారు.
చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
అధికారులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే హైదరాబాద్‌లో తరలించాలన్నారు. వెంటనే ప్రమాద స్థలికి చేరుకొని దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆర్టీసీ ఎండీ, రవాణా కమిషనర్, ఫైర్ డీజీకి ఆదేశించారు.
మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు ముఖ్యమంత్రి. అలాగే అందుబాటులో ఉన్న మంత్రులు ప్రమాద సంఘటనకు చేరుకోవాలన్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రమాద వివరాలు-అధికారుల మధ్య సమన్వయం చేయనుంది కంట్రోల్ రూమ్. ప్రమాద సమాచారం కోసం AS: 9912919545, SO: 9440854433 నెంబర్లు సంప్రదించాలని కోరింది ప్రభుత్వం.
ప్రమాదంలో గాయపడిన వారికి వేగంగా వైద్యం అందించేందుకు గాంధీ-ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారందరిని కాపాడేందుకు వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని, హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
ఘటనకు అదే కారణమా?
బస్సు ప్రమాదం ఉదయం 7.05 గంటలకు జరిగినట్టు డిపో మేనేజర్ తెలిపారు. ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి తెల్లవారుజామున 4.45 గంటలకు బయలుదేరింది. టిప్పర్‌లో సుమారు 50 టన్నుల కంకర ఉన్నట్లు చెబుతున్నారు. గుంతను తప్పించబోయి టిప్పర్.. బస్సుని ఢీ కొట్టింది. కంకరలో కూరుకుపోయారు ప్రయాణికులు. బస్సు కుడివైపు ఉన్న 8 సీట్లు వరకు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. మృతుల్లో ఎక్కువగా తాండూరు వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో వలస కూలీలతోపాటు హైదరాబాద్‌కు వస్తున్నారు పలువురు ఉద్యోగులు. తాండూరులో 30 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. బస్సులో కుడివైపు 21 మంది స్పాట్‌లో మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందినవారు నలుగురు మృతి చెందారు. మృతుల్లో వలస కూలీలతోపాటు హైదరాబాద్ కు వస్తున్నారు పలువురు ఉద్యోగులు. ఘటన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు.
ఆర్టీసీ బస్సు-టిప్పర్ లారీ ఢీ కొన్న ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆర్టీసీ, లారీ డ్రైవర్లు సహా ఇప్పటివరకు 20 మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. వారిలో 10 మంది పురుషులు, 9మంది మహిళలలు, ఓ బాలుడు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు, మూడు జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను వారి బంధువులకు అప్పగించనున్నారు.
ALSO READ: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ
చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతి చెందడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు.
చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశం
డీజీపీతో ఫోన్ లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగించాలన్న సీఎం https://t.co/Kar1C7P6Q6 pic.twitter.com/eNkFGR5PEK
— BIG TV Breaking News (@bigtvtelugu) November 3, 2025