BigTV English

Sundarakanda: లవర్ బాయ్‌గా నారా రోహిత్.. ‘సుందరకాండ’ నుండి మొదటి ప్రేమపాటకు ముహూర్తం ఫిక్స్

Sundarakanda: లవర్ బాయ్‌గా నారా రోహిత్.. ‘సుందరకాండ’ నుండి మొదటి ప్రేమపాటకు ముహూర్తం ఫిక్స్

Sundarakanda First Single: తాము చేసే సినిమాలు హిట్ అయినా.. ఫ్లాప్ అయినా.. కొందరు నటీనటులు మాత్రం ఒకే తరహా స్క్రిప్ట్‌ను సెలక్ట్ చేసుకుంటూ వాటిలోనే నటించడానికి ఇష్టపడతారు. అలాంటి హీరోల్లో నారా రోహిత్ కూడా ఒకరు. ఎక్కువగా కమర్షియల్ సినిమాలవైపు వెళ్లకుండా సోషల్ మెసేజ్ ఉన్న చిత్రాలతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నారా రోహిత్. అవి హిట్ అయినా, ఫ్లాప్ అయినా అలాంటి కథలనే ఎంచుకుంటూ ముందుకెళ్లాడు. కానీ మొదటిసారి ఒక ప్రేమకథతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు ఈ హీరో. తన అప్‌కమింగ్ ‘సుందరకాండ’ నుండి తాజాగా అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది.


టీజర్ బాగుంది

నారా రోహిత్ ఇప్పటివరకు 19 సినిమాల్లో హీరోగా నటించాడు. అందులో ఎక్కువగా సోషల్ మెసేజ్ చిత్రాలే కనిపిస్తాయి. కానీ తన 20వ చిత్రం ‘సుందరకాండ’ కోసం మొదటిసారి లవర్ బాయ్‌గా మారాడు రోహిత్. ఈ మూవీ ఫస్ట్ లుక్ దగ్గర నుండి గ్లింప్స్, టీజర్.. ఇలా అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తన కెరీర్‌లో మొదటిసారి ‘సుందరకాండ’లో కూల్ లుక్స్‌తో అలరించడానికి సిద్ధమయ్యాడు ఈ హీరో. ఈ మూవీలో నారా రోహిత్ హీరోగా నటిస్తుండగా విర్తి వాఘని హీరోయిన్‌గా నటిస్తోంది. అంతే కాకుండా అలనాటి నటి శ్రీదేవి కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రాగా ఈ సినిమా నుండి మొదటి పాట విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్.


Also Read: విశాఖలో వివాదంగా మారిన వినాయక ‘పుష్ప’..ఇదేం పిచ్చిరా నాయనా?

హీరోయిన్ ఎవరు

‘సుందరకాండ’ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించాడు. తన మ్యూజిక్ డైరెక్షన్‌లో ‘బహుశ బహుశ బహుశ’ అంటూ సాగే పాట.. సెప్టెంబర్ 11న సాయంత్రం 5.04 నిమిషాలకు విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్ కోసం ఒక స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్‌లో నారా రోహిత్‌తో పాటు హీరోయిన్ విర్తి కాకుండా శ్రీదేవి ఉండడం ప్రేక్షకుల్లో పలు సందేహాలు క్రియేట్ చేస్తోంది. ఒకవేళ ఇది ఒక మిడిల్ ఏజ్ లవ్ స్టోరీ ఏమో అని ఆడియన్స్‌లో డౌట్లు మొదలయ్యాయి. సిడ్ శ్రీరామ్ పాడిన ఈ పాట లిరికల్ వీడియో విడుదల అయితే అసలు ఇందులో హీరోయిన్ ఎవరు అనే విషయంపై క్లారిటీ రావచ్చని భావిస్తున్నారు.

ప్రేమకథలు ఒక్కటి కావు

అసలైతే ‘సుందరకాండ’ మూవీ ఈపాటికే థియేటర్లలో విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఇంకా దీని రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేదు. పాటలతో ప్రమోషన్స్ కూడా ప్రారంభిస్తున్నారు కాబట్టి వచ్చే నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సంతోష్ చిన్నపొల్లా, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహాంకాళి.. ‘సుందరకాండ’ను నిర్మిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై మూవీ తెరకెక్కుతోంది. ‘ఏ రెండు ప్రేమకథలు ఒక్కటి కావు’ అనే కాన్సెప్ట్‌తో మూవీ తెరకెక్కిందని ఇప్పటికే పోస్టర్స్ ద్వారా రివీల్ చేశారు మేకర్స్. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే నారా రోహిత్‌ను మరికొన్ని లవ్ స్టోరీలలో చూడవచ్చని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×