E-Paper
Advertisement

ఎకరం రూ.237 కోట్లు.. కట్ చేస్తే హైకోర్టులో షాక్.. SBI ఎంట్రీతో వేలంపై స్టే!

ఎకరం రూ.237 కోట్లు.. కట్ చేస్తే హైకోర్టులో షాక్.. SBI ఎంట్రీతో వేలంపై స్టే!
Advertisement

Raidurg Auction: హైదరాబాద్ రాయదుర్గంలోని భూముల వేలంపై హైకోర్టు మూడు వారాలపాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మూడు వారాల్లోపు కౌంటర్​ దాఖలు చేయాలని టీజీఐఐసీ, గౌర వెంచర్స్ కు నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్ రాయదుర్గంలోని సర్వే నెంబర్ 83/1లోని ఆరు ఎకరాలకు పైగా భూమిని టీజీఐఐసీ ఇటీవల వేలంపాట ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. ఎకరానికి 237 కోట్ల చొప్పున గౌర వెంచర్స్​ బిడ్ వేసి ఈ భూములను దక్కించుకుంది. అయితే, ఈ భూమిలో అయిదు ఎకరాలు తమదేనంటూ ఎస్​బీఐ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.

Advertisement

ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఎస్బీఐ 2010లోనే ఈ భూమికి సంబంధించి టీజీఐఐసీతో ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు. కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం రెండేళ్లలోపు అక్కడ ఎస్బీఐ నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. అయితే ఒప్పందం జరిగి పదహారేళ్లు గడిచినా ఎస్​బీఐ అక్కడ ఎలాంటి నిర్మాణ పనులను ప్రారంభించలేదన్నారు.

నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలోనే ఆ భూమిని వేలానికి పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఈ వాదనలపై ధర్మాసనం తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరును తప్పు పడుతూ ఏ కారణంతో ఈ భూమిని వేలం వేశారు? అని ప్రశ్నించింది. అది ఎస్బీఐకి చెందిన భూమి అని మీకు తెలియదా? అని అడిగింది. ఓ ప్రభుత్వ సంస్థ భూమిని అలా ఎలా వేలం వేస్తారని సూటిగా ప్రశ్నించింది. ఇలా భూములను వేలం వేస్తూ రాష్ట్రంలో రియల్​ ఎస్టేట్ వ్యాపారాన్ని పరుగులు పెట్టించాలనుకున్నారా? అంటూ వ్యాఖ్యానించింది.

Advertisement

Also Read: హైదరాబాద్ భూకబ్జా కేసు.. వైసీపీ నేత బొల్లా ఆన్సర్లకు.. పోలీసులకే బైండ్ బ్లాక్!

దీనిపై అదనపు అడ్వకేట్​ జనరల్ తన వాదనలు వినిపిస్తూ వేలం ద్వారా వచ్చే నిధులను ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తుందని తెలిపారు. వాదనలు ముగిసిన తరువాత రాయదుర్గం భూముల వేలంపై మూడు వారాలపాటు స్టే విధిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Related News

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

Big Stories

Advertisement
×