E-Paper
Advertisement

సీఎంఆర్ అక్రమాలపై ఉత్తమ్ ఫోకస్.. 12 ఏళ్ల లెక్కల తేల్చేందుకు సమీక్ష!

సీఎంఆర్ అక్రమాలపై ఉత్తమ్ ఫోకస్.. 12 ఏళ్ల లెక్కల తేల్చేందుకు సమీక్ష!
Advertisement

CMR Defaulters: రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ వ్యవహారంలో జరుగుతున్న అక్రమాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా బకాయిలు పడుతూ ప్రభుత్వానికి సవాలుగా మారిన సీఎంఆర్ డిఫాల్టర్లను ముందుగానే పసిగట్టేందుకు ‘ఎర్లీ వార్నింగ్ సిస్టమ్’ను తీసుకురాబోతోంది. ఈ మేరకు సచివాలయంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పౌరసరఫరాల శాఖ ఉన్నతస్థాయి అధికారులతో మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్రజాధనాన్ని కాపాడటంతో పాటు పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా ఈ కీలక భేటీ జరగనుంది.

గత 12 ఏళ్ల లెక్కల తేల్చేందుకు బిగ్ రివ్యూ

Advertisement

గత 10 నుండి 12 ఏళ్ల కాలంలో మిల్లర్లకు కేటాయించిన ధాన్యం ఎంత? దానికి సరిపడా బియ్యం ప్రభుత్వానికి ఎంత అందింది? అనే అంశాలపై మంత్రి లోతుగా సమీక్షించనున్నారు. ఏటా జిల్లాలు, సంవత్సరాలు, మిల్లుల వారీగా సీఎంఆర్ డిఫాల్టర్ల జాబితాను రూపొందించి, బకాయిల అసలు విలువను తేల్చనున్నారు. ఒక్క క్వింటాల్ బియ్యం, ఒక్క రూపాయి బకాయి కూడా వదలకుండా ప్రతీదీ రికవరీ చేయాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.

కఠిన చర్యలు.. ఆస్తుల జప్తుకు ఆదేశాలు

Advertisement

డిఫాల్టర్లుగా మారిన మిల్లర్లపై కేవలం నోటీసులతో సరిపెట్టకుండా రెవెన్యూ రికవరీ చట్టం కింద వేగవం తమైన చర్యలు తీసుకోనున్నారు. అవసరమైన చోట సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు డిఫాల్టర్ల చర, స్థిరాస్తులను జప్తు చేసే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. బ్యాంకు గ్యారంటీలు, సెక్యూరిటీల ద్వారా ప్రభుత్వ బకాయిలను వెంటనే రాబట్టాలని అధికారులను ఆదేశించనున్నారు. ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చేసిన తనిఖీలు, నమోదైన కేసులు, కోర్టు వివాదాల పురోగతిపై కూడా ఈ భేటీలో స్పష్టత రానుంది.

సాంకేతికతతో పర్యవేక్షణ.. పక్కా ప్లాన్

భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా ధాన్యం తరలింపు నుండి బియ్యం సేకరణ వరకు సాంకేతిక ఆధారిత జియో-ట్రాకింగ్, మిల్లుల్లో ఎప్పటికప్పుడు స్టాక్ వెరిఫికేషన్ చేసేలా కొత్త నిబంధనలు తెస్తున్నారు. పౌరసరఫరాలు, విజిలెన్స్, రెవెన్యూ, న్యాయ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ, భవిష్యత్ సీఎంఆర్ ఒప్పందాల్లో కఠినమైన రక్షణలు చేర్చనున్నారు. గత 12 ఏళ్ల పూర్తి స్థాయి నవీకరించిన రికార్డులతో సమావేశానికి హాజరు కావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Also Read:E20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ నిరసన.. ప్రధాని నివాసానికి పాదయాత్ర!

Tags

Related News

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో భూముల రచ్చ.. 388 ఎకరాలు VS 933 ఎకరాలు

ఇంట్లోనే 30 ఏళ్లుగా పెరుగుతున్న పుట్ట.. భయంతో వణుకుతున్న వృద్ధురాలు!

అటెండర్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. ఇద్దరు కేటుగాళ్ల అరెస్ట్!

కుంభమేళా రేంజ్‌లో గోదావరి పుష్కరాలు.. రేవంత్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!

48 కిలోల పంచలోహాలు, 24 క్యారెట్ల బంగారం పూత? బేగంబజార్ గణనాథుడిపై పోలీసుల క్లారిటీ!

బీసీ కుల గణనపై కేంద్రం కుట్ర.. కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం

నా భూమిలో చిన్న తప్పున్నా 13 ఎకరాలు రాసిచ్చేస్తా! సీఎం రేవంత్‌కు హరీశ్ రావు సవాల్

వైష్ణవి భర్త హరిబాబు హత్యపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ, సంతోష్ ‘రివేంజ్’ ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×