E-Paper
Advertisement

Telangana Inter Practical Exams-2026: తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్-2026.. నిఘా మధ్య పరీక్షలు, కన్ను తిప్పితే

Telangana Inter Practical Exams-2026: తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్-2026..  నిఘా మధ్య పరీక్షలు, కన్ను తిప్పితే
Advertisement

Telangana Inter Practical Exams-2026: తెలంగాణ ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటి నుంచే పక్కాగా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. విమర్శలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతోంది. అంతకుముందు నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఈసారి ప్రాక్టికల్ పరీక్షలను సీసీ కెమెరాలు ఆధ్వర్యంలో జరగనున్నాయి. కన్ను తిప్పితే చాలు ఆ విద్యార్థికి కష్టాలు మొదలవుతాయి.

తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్-2026

Advertisement

తెలంగాణ ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఎగ్జామ్స్‌పై గట్టి నిఘా పెట్టనుంది ఇంటర్ బోర్డు. ఇప్పటి నుంచి వాటికి సంబంధించిన చర్యలు చేపట్టింది. పోయిన ఏడాది సీసీ కెమెరాల ద్వారా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షించారు. ఈసారి ఫ్లయింగ్‌ స్క్వాడ్ టీమ్స్‌ని పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ఇంటర్‌ ఫస్ట-సెకండియర్, ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.

ఈ పరీక్షలకు లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతారని భావిస్తోంది. గతేడాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. బోర్డు నుంచి ప్రాక్టికల్స్‌ పర్యవేక్షణ కోసం అధికారులను నియమించలేదు. చివరి నిమిషంలో నిర్ణయం వల్ల ప్రైవేట్‌ కళాశాలలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. ఈసారి ముందుగానే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు బోర్డు అధికారులు. డిపార్ట్‌మెంటల్‌ అధికారులతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్వయంగా తెలిపారు.

Advertisement

సీసీ కెమెరాలు, ఫ్లయింగ్ స్వాడ్ నిఘాలో పరీక్షలు

కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు, ఇతర గురుకులాలు ఆ శాఖల పరిధిలో ఉంటాయి. అక్కడ సీసీ కెమెరాలున్నా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానం కాలేదు. ఏదైనా జరిగినా చర్య తీసుకునే అధికారం బోర్డుకు ఉండదు. ఈసారి ఆ తరహా ప్రాక్టికల్‌ పరీక్షా కేంద్రాలను తొలగించడంతో ఆయా విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలకు రావాల్సి ఉంటుంది. ప్రభుత్వ-ప్రైవేట్‌ కళాశాలలు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానమైనందున వాటిల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.

ALSO READ:  రాజమౌళి నిండు నూరేళ్లు బతికి మంచిగా సక్సెస్ కావాలి-బండి సంజయ్

2026 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ ఫస్టియిర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిని రిహార్సల్‌గా బోర్డు భావిస్తోంది. మాస్‌ కాపీయింగ్‌ లేకుండా ఉండేలా సీసీ కెమెరాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్ టీమ్స్ ని ఏర్పాటు చేస్తోంది.  నాలుగైదు రోజుల గ్యాప్‌లో ఇంటర్ పరీక్షలు మొదలుకానున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు జరుగుతాయి. సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×