E-Paper
Advertisement

Supreme Court: ఉత్కంఠ.. సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ

Supreme Court: ఉత్కంఠ.. సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ

Supreme Court: నేడు(శుక్రవారం) సుప్రీం కోర్టులో తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. ఈ కేసును జస్టిస్ దీపాంకరదత్త, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌లతో ధర్మాసనం విచారించనుంది. అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న తాజా నిర్ణయాల నేపథ్యంలో ఈ విచారణపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణ అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపులపై దాఖలైన అనర్హత పిటిషన్లను.. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇటీవల పరిశీలించి కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేస్తూ.. వారు పార్టీ మారలేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్‌లపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్ నిరాకరించారు. విచారణ అనంతరం వారికి క్లీన్ చిట్ ఇస్తూ నిర్ణయం వెలువరించారు.

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై గత విచారణ సందర్భంగా.. నవంబర్ 17న సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. డిసెంబర్ 18వ తేదీ లోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలు ఇచ్చింది. అయితే నిర్ణయం ఆలస్యం కావడంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేయడంతో.. స్పీకర్ విచారణలో వేగం పెంచారు. ఆ క్రమంలోనే ఐదుగురు ఎమ్మెల్యేలపై తీర్పు వెలువడింది.

ఈ ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకున్న తర్వాత.. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన వివరణను వెల్లడించారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఆయన స్పష్టంగా చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు.

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ మొదటగా పది మంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేసింది. 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీ గుర్తుపై గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య, దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్.. ఈ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు.. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అనర్హత తీర్మానం కాపీని అందజేశారు. ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. అయితే స్పీకర్ నిర్ణయం ఆలస్యమవుతుండటంతో బీఆర్ఎస్ నేతలు మొదట హైకోర్టు, ఆపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Also Read: పంచాయతీ ఫలితాలు.. బీఆర్ఎస్‌లో గేమ్ మొదలు, హరీష్‌రావు కోసం కొత్త పదవి?

సుప్రీం కోర్టు జోక్యంతో స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. మిగిలిన ఎమ్మెల్యేలపై ఎప్పుడు నిర్ణయం వెలువడుతుందన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో నేటి సుప్రీం కోర్టు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మిగిలిన ఎమ్మెల్యేల విషయంలోనూ స్పీకర్‌కు గడువు విధిస్తారా? లేక కొత్త ఆదేశాలు ఇస్తారా? అన్న అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×