E-Paper
Advertisement

మధురై తనిష్క్ దోపిడీ కేసులో కీలక మలుపు.. ప్రధాన నిందితుడు అరెస్ట్, 11.7 కిలోల బంగారం రికవరీ

మధురై తనిష్క్ దోపిడీ కేసులో కీలక మలుపు.. ప్రధాన నిందితుడు అరెస్ట్, 11.7 కిలోల బంగారం రికవరీ
Advertisement

Madurai Tanishq Robbery: తమిళనాడులో సంచలనం సృష్టించిన మధురై తనిష్క్ నగల దోపిడీ కేసులో ఎట్టకేలకు కీలక మలుపు తిరిగింది. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఈ దోపిడీ ప్రధాన సూత్రధారి నిషాంత్ కథ కంచికి చేరింది. పక్కా ప్లాన్‌తో కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లిన నిషాంత్‌ను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

కండక్టర్ ఇచ్చిన క్లూతో చిక్కాడిలా..

Advertisement

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిషాంత్ బెంగళూరు నుంచి సేలం వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఎక్కాడు. అయితే, అతడి కదలికలపై అనుమానం వచ్చిన బస్సు కండక్టర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కండక్టర్ ఇచ్చిన ఆ ఒక్క క్లూతో అప్రమత్తమైన పోలీసులు.. ధర్మపురి సమీపంలోని శేషంపట్టి వద్ద బస్సును అడ్డగించి నిషాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అదియమాన్ కోట పోలీస్ స్టేషన్‌లో అతడిని నాలుగు గంటల పాటు విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కొండల్లో దాచిన కిలోల కొద్దీ బంగారం

Advertisement

విచారణలో నిషాంత్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు కపాలీశ్వరర్ కొండతో పాటు పలు ప్రాంతాల్లో విడివిడిగా దాచిపెట్టిన 6.2 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో 5.5 కిలోల బంగారాన్ని రికవరీ చేయగా.. తాజా రికవరీతో కలిపి మొత్తం 11.7 కిలోల బంగారు నగలు పోలీసుల చేతికి చిక్కాయి. దోపిడీకి ముందే కస్టమర్ ముసుగులో నిషాంత్ పలుమార్లు తనిష్క్ షోరూంకు వెళ్లి రెక్కీ నిర్వహించినట్లు తేలింది.

డిసెంబర్ 1 వరకు రిమాండ్..

ఈ కేసులో ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షితో పాటు నిషాంత్ తండ్రి సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా నిషాంత్‌ను న్యాయస్థానంలో హాజరుపరచగా.. కోర్టు అతడికి డిసెంబర్ 1 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు నిందితుడిని మధురై కేంద్ర కారాగారానికి తరలించారు. మిగిలిన నగల రికవరీతో పాటు, ఈ దోపిడీ వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Also Read: మాజీ డీజీపీకే దిమ్మతిరిగే షాక్.. రూ.18 కోట్ల భూమిని మాయం చేసిన రియల్టర్లు!

Tags

Related News

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. 100 మీటర్ల లోయలో పడ్డ బస్సు, 8 మంది మృతి

ఎస్‌ఐఆర్‌పై రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం.. సుప్రీంకోర్టులో మరో పిటిషన్.. ఈసీఐకి 48 ప్రశ్నలు!

తండ్రిపై దాడికి ప్రతీకారం.. హోటల్‌పై అక్కాచెల్లెళ్ల దాడి.. చుక్కలు చూపించేశారు భయ్యా!

బిల్కిస్ బానో కేసులో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్!

బిగ్‌బీ హత్యకు భారీ కుట్ర.. ముంబై గ్యాంగ్‌స్టర్ ఓపెన్ వార్నింగ్.. 200 మంది అనుచరులతో స్కెచ్?

సింహాన్ని బైకులపై వెంబడించిన అటవీ సిబ్బంది.. తిరగబడ్డ మృగరాజు, వీడియో వైరల్!

గంటల వ్యవధిలో ఇద్దరు ప్రయాణికులు.. రైలు నుంచి సముద్రంలోకి జంప్, పంబన్ వంతెనపై ఘటనలు

Big Stories

Advertisement
×