E-Paper
Advertisement

Telangana Rising Global Summit-2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025, రెండో రోజు షెడ్యూల్ ఈ విధంగా, 20 సమావేశాల్లో సీఎం రేవంత్

Telangana Rising Global Summit-2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025, రెండో రోజు షెడ్యూల్ ఈ విధంగా, 20 సమావేశాల్లో సీఎం రేవంత్
Advertisement

Telangana Rising Global Summit-2025: హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. తొలిరోజు వివిధ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. దాదాపు 4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణలో ప్లూచర్ ప్రణాళికను ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. రెండరోజు షెడ్యూల్ ఏంటి? 

Advertisement

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025, రెండో రోజు షెడ్యూల్

Advertisement

తెలంగాణ రైజింగ్గ్లోబల్​ సమ్మిట్-2025లో రెండో రోజు అంటే మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దాదాపు 20 సమావేశాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్​, పవర్​, టూరిజం, లైఫ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, AI తోపాటు వివిధ రంగాల పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.

ఉదయం 9.30 కు ఎంసీహెచ్​ఆర్​డీ నుంచి హెలికాప్టర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ సిటీకి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్‌గా ఆవిష్కరిస్తారు. సాయంత్రం మహీంద్రా అండ్​ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

20 సమావేశాల్లో సీఎం రేవంత్

గ్రీన్ వెహికిల్స్​, రూరల్ ఎంటర్‌ప్రైజ్ రంగాల్లో పెట్టుబడులపై చర్చించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ‘తెలంగాణ రైజింగ్​ విజన్​-2047 డాక్యుమెంట్’​‌ను ఆవిష్కరిస్తారు. రాత్రి 7 గంటలకు డ్రోన్ షో, ఫైర్ వర్స్‌తో Telangana is RisingCome, Join the Rise థీమ్‌ ప్రదర్శనతో ముగింపు వేడుక నిర్వహించనుంది ప్రభుత్వం.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో మంగళవారం ఉదయం 10 గంటలకు అటవీ- పర్యావరణం, దేవాదాయ శాఖల ప్రగతి నివేదికపై కీలక ప్రసంగం చేయనున్నారు మంత్రి కొండా సురేఖ. ఈ రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, ముఖ్యమైన విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. రానున్న రోజుల్లో తన శాఖలకు సంబంధించి అభివృద్ధి అంశాల విజన్‌ ఎలా ఉండనుంది అనేది వివరించనున్నారు. అనంతరం జరగనున్న ప్యానెల్ డిస్కషన్ లో పాల్గొంటారు.

ALSO READ: మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి వైన్స్ బంద్

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×