E-Paper
Advertisement

తెలంగాణ రైతులకు బంపరాఫర్.. బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి

తెలంగాణ రైతులకు బంపరాఫర్.. బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి
Advertisement

Telangana Farmers: తెలంగాణ రైతులకు ఒకేసారి శుభవార్తలు. జూన్ 20న పీఎం కిసాన్ డబ్బులు ఖాతాలో జమకానున్నాయి. 30న రైతు భరోసా నిధులను విడుదల కానున్నాయి. వానాకాలం సీజన్‌ మొదలుకావడంతో పంట సాగు చేసే పెట్టుబడి సాయం అందనుంది. రైతు భరోసా నిధుల విడుదల తేదీని తెలంగాణ కేబినెట్ దాదాపుగా ఖరారు చేసినట్టు సమాచారం.

తెలంగాణలో అన్నదాతలకు బంపరాఫర్

Advertisement

తెలంగాణ రైతులకు ఒకేసారి శుభవార్త చెప్పాయి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు. వర్షాకాలం వేళ పంటల పెట్టుబడి సాయం కింద కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆర్థిక సాయం రైతుల ఖాతాల్లో జమ కానుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద మోదీ ప్రభుత్వం రైతుల ఖాతాలో రూ.2 వేలు జమ చేయనుంది.

అదే సమయంలో రైతు భరోసా పథకం కింద రేవంత్ ప్రభుత్వం రూ.6 వేలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. పీఎం కిసాన్ నిధులను జూన్ 20 అంటే శనివారం రైతుల ఖాతాలో నిధులు పడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా నిధులను జూన్ 30న విడుదల చేయనుంది. తొలుత రైతు భరోసా నిధులను జూన్ 26న విడుదల చేయాలని భావించింది తెలంగాణ ప్రభుత్వం.

Advertisement

10 రోజుల గ్యాప్‌లో నిధులు విడుదల చేయనున్న కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు

తాజాగా కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత ఈనెల 30న విడుదల చేయాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్‌‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

జూన్ 30 నుంచి వరుసగా వారం లేకుంటే 10 రోజులపాటు అన్నదాతల బ్యాంకు అకౌంట్లలో రైతు భరోసా నిధులను జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకం కింద మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందిస్తోంది. ఏడాదికి ఒక ఎకరానికి రూ.12 వేల చొప్పున వానాకాలం-యాసంగి సీజన్ల‌‌‌‌కు సంబంధించి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో ప్రభుత్వం వేస్తోంది.

ALSO READ: నీట్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్!

తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 73 లక్షల మంది రైతులకు దశల వారీగా పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. మోదీ ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతుల అకౌంట్లలో నిధులు జమ చేయనుంది. జూన్ 20న శనివారం ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం 23వ విడత డబ్బులు అన్నదాతల ఖాతాల్లో వేయనుంది.

బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో పీఎం మోదీ కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. ఒక్కో రైతు అకౌంట్లో రూ. 2 వేల చొప్పున జమ చేయనుంది. ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

Related News

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

Big Stories

Advertisement
×