BigTV English

Telangana Rythu Runa Mafi: రెండో విడత రుణమాఫీకి ఏర్పాట్లు.. రేపే రైతుల ఖాతాల్లో నగదు జమ!

Telangana Rythu Runa Mafi: రెండో విడత రుణమాఫీకి ఏర్పాట్లు.. రేపే రైతుల ఖాతాల్లో నగదు జమ!

Telangana Rythu Runa Mafi: తెలంగాణలో రుణమాఫీ రెండోదశకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రుణమాఫీ మూడు దఫాలుగా చేస్తామని ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రూ.లక్షల్లోపు రుణాలను మాఫీ చేశారు. మంగళవారం రైతుల రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అంశంపై ఆర్థిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.


రూ.1.50 లక్షల్లోపు రుణాలున్న వారి ఖాతాల్లో మాఫీ డబ్బులు జమను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటికే రూ.లక్షలోపు రుణాలున్న వారికి మాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు ఆగస్టు నెలఖారులోగా రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

రూ.లక్షన్నర లోపు ఉన్న రైతుల ఖాతాల్లోకి నిధులు పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో అసెంబ్లీ ఆవరణలోనే దీనికి సంబంధించిన విషయంపై ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మొదటి విడతలో రూ.లక్ష వరకు మాఫీ చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా కొంతమంది రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదని పలు ఫిర్యాదులు అందాయని మంత్రి తుమ్మల చెప్పారు.


మొదటి విడతలో రూ.లక్ష రుణాలు ఉణ్న అందరికీ మాఫీ అవుతుందని, ఎవరూ అధైర్యపడవద్దని మంత్రి సూచించారు. ఈ రుణ మాఫీ నగదును రిజర్వ్ బ్యాంకు ఈ కుబేర్ విధానంలో జమ చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మొదటి విడతలో 17,877 మంది లబ్ధిదారుల్లో 84.94 కోట్ల నిధులు జమ కాలేదన్నారు. దీనికి సంబంధించిన నిధులు ఆర్బీఐ వద్దనే ఉన్నాయని తెలిపారు.

Related News

Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 22 గేట్లు ఎత్తివేత

Medak floods: గర్భగుడి వరకు చేరిన వరద నీరు.. మూసివేతలో తెలంగాణలోని ప్రధాన ఆలయం!

Heavy rains: రాష్ట్రంలో కుండపోత వానలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!

CM Progress Report: రియల్ ఎస్టేట్‌కి బెస్ట్.. సీఎం రేవంత్ రెడ్డి నయా ప్లాన్ ఇదే.!

Telangana Jagruthi: సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నార్వే దేశాల్లోనూ జాగృతి.. కవిత కీలక నిర్ణయం

Heavy rains: రాష్ట్రంలో అత్యంత భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Big Stories

×