E-Paper
Advertisement

Telangana Schools: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులు, వేసవి హాలీడేస్ లాక్.. ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి!

Telangana Schools: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులు, వేసవి హాలీడేస్ లాక్.. ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి!
Advertisement

Telangana Schools: తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ తరగతులు జరపాలని ఆదేశించారు. తరగతులు ముగిసిన అనంతరం మ. 12.30 తర్వాత సంబంధిత పాఠశాలలో యథావిధిగా మధ్యాహ్న భోజనం అందజేయనున్నట్లు స్పష్టం చేసారు.

మరోవైపు పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలలో మ. 1:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకూ ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలియజేసింది. అటు పదో తరగతి పరీక్షలు ముగిసేవరకూ టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు కొనసాగుతాయని వెల్లడించింది.

Advertisement

మరోవైపు వేసవి సెలవులను సైతం తెలంగాణ విద్యాశాఖ ఖరారు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకూ సమ్మర్ హాలీడేస్ గా వెల్లడించింది. తిరిగి జూన్ 12న స్కూళ్లు తెరుచుకుంటాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను తమ ఆదేశాలని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. లేని పక్షంలో ఆయా స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Also  Read: Delhi Accident Video: రీల్స్ చేస్తూ డ్రైవింగ్.. దిల్లీ యాక్సిడెంట్ కేసులో.. వెలుగులోకి షాకింగ్ వీడియో

Advertisement

రాబోయే రంజాన్ పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉర్దూ స్కూళ్లతో పాటు పాటు డైట్ (DIET) కళాశాలలకు ప్రత్యేక పని వేళలను కల్పించింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకూ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో మిస్ అయిన సిలబస్ ను కవర్ చేసేందుకు మార్చి 20 నుంచి అదనపు తరగతులు ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Also  Read: Air Cooler vs Air Conditioner: సమ్మర్‌లో ఏసీ కొనాలా? కూలర్ కొనాలా? మీకు ఏది సరైనది!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×