E-Paper
Advertisement

Telangana Weather : కమ్ముకున్న మేఘాలు.. హైదరాబాద్ లో వర్షం.. మరో రెండురోజులు ?

Telangana Weather : కమ్ముకున్న మేఘాలు.. హైదరాబాద్ లో వర్షం.. మరో రెండురోజులు ?
Advertisement

Telangana Weather : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం వర్షం కురిసింది. కర్మన్ ఘాట్, చంపాపేట్, సంతోష్ నగర్, ఉప్పల్, తార్నాక, మలక్ పేట, అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబర్ పేట్, దిల్ సుఖ్ నగర్, మాసబ్ ట్యాంక్, మీర్ పేట, బాలాపూర్, జూబ్లీహిల్స్, మాదాపూర్, దుర్గంచెరువు, హైటెక్ సిటీ, మైత్రీవనం, సనత్ నగర్, ప్రగతినగర్, పంజాగుట్ట, తిరుమలగిరి, అల్వాల్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో.. విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా.. మెట్రో ట్రైన్లలో రోజూకంటే రద్దీ మరింత పెరిగింది. కాగా.. గురువారం సాయంత్రంలోగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవవచ్చని వాతావరణశాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా మరో రెండురోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణతో పాటు ఏపీలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, యానాంలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈశాన్య దిశ నుంచి తెలంగాణవైపుకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి.

Advertisement

.

.

Advertisement

.

Tags

Related News

కోడి చెరువు వివాదం.. పవన్ కళ్యాణ్‌కు బిగ్ రిలీఫ్.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు!

హైదరాబాదీలకు షాక్.. రేపటి నుంచి క్యాబ్‌లు, ఫుడ్ డెలివరీలు బంద్!

Chief Secretary: తెలంగాణ సచివాలయంలో సమన్వయ లోపం?.. అధికారుల సీక్రెట్ మీటింగ్స్!

Rain Prayers: వర్షాల కోసం కుకుట్లపల్లి విద్యార్థుల వినూత్న ప్రార్థన!

భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!

TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్‌డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!

రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్‌రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!

Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?

Big Stories

Advertisement
×