E-Paper
Advertisement

‘నా భార్య ఇజ్జత్ తీస్తోంది.. బతకాలని లేదు’.. సెల్ఫీ వీడియో పెట్టి యువకుడి అదృశ్యం

‘నా భార్య ఇజ్జత్ తీస్తోంది.. బతకాలని లేదు’.. సెల్ఫీ వీడియో పెట్టి యువకుడి అదృశ్యం
Advertisement

Shivaprasad Missing: ‘నా భార్య నా ఇజ్జత్ తీస్తోంది.. నాకు ఈ బతుకు బతకాలని లేదు’ అంటూ ఓ యువకుడు కన్నీటిపర్యంతమవుతూ తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి అదృశ్యమైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం రేపింది. బాలానగర్ మండలం మోతీఘనపూర్ గ్రామానికి చెందిన శివప్రసాద్ (23) తన భార్య పెడుతున్న నరకాన్ని తట్టుకోలేక ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పెద్దల ముందు దోషిగా నిలబెడుతోందని ఆవేదన

Advertisement

తాను అదృశ్యమయ్యే ముందు శివప్రసాద్ రికార్డ్ చేసిన వీడియోలో తన ఆవేదనను వెళ్లగక్కాడు. తన భార్య తరచూ చిన్న విషయాలకే గొడవలు పెట్టుకుంటూ, బూతులు తిడుతూ, చేయి చేసుకుంటోందని వాపోయాడు. అంతేకాకుండా, గ్రామంలోని పెద్ద మనుషుల ముందు తనేదో పెద్ద తప్పు చేసినట్లు చిత్రీకరిస్తూ తన పరువు తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘చట్టాలు ఆడవారి వైపే ఉన్నాయన్న ధీమాతో నా జీవితంతో ఆడుకుంటోంది. కొడుతూ, కొరుకుతూ నన్ను పిచ్చివాడిని చేసి చనిపోమంటోంది’ అని శివప్రసాద్ ఆ వీడియోలో కన్నీరుమున్నీరయ్యాడు.

కొత్తూరు వద్ద స్కూటీ లభ్యం

Advertisement

‘నాకు ఇక బతకాలని లేదు, మీరైనా సంతోషంగా ఉండండి’ అంటూ తల్లిదండ్రులకు చివరి సందేశం పంపిన శివప్రసాద్.. తన స్కూటీపై హైదరాబాద్ వైపు వెళ్లాడు. కంగారుపడిన కుటుంబ సభ్యులు వెతకగా.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు వద్ద అతని స్కూటీ నిలిపి ఉంచి కనిపించింది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శివప్రసాద్ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Also Read: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం.. తప్పిన ముప్పు

Tags

Related News

ఎర్ర బస్సు స్టయిల్‌లో.. విమానం ఎక్కిన పల్లెటూరు దంపతులు, వీడియో షేర్ చేసిన కేంద్రమంత్రి

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం.. తప్పిన ముప్పు

హైదరాబాద్‌ సిటీలో మరోసారి భూముల అమ్మకం.. ఏయే ప్రాంతాలు, ఈ-ఆక్షన్ తేదీలు ఇవే!

ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయం చాలా ప్రమాదకరం.. ఎలానో క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత!

తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల..?

కాంగ్రెస్ అభయ హస్తం మొత్తం శూన్య హస్తమే.. హరీష్ రావు ఫైర్!

ఏపీ కాంట్రాక్టు ఉద్యోగాల జాబ్ స్కామ్‌లో.. మేడ్చల్ ప్రాంత లింకులు..?

Big Stories

Advertisement
×