E-Paper
Advertisement

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం.. తప్పిన ముప్పు

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం.. తప్పిన ముప్పు
Advertisement

Balmuri Venkat: కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రయాణిస్తున్న కారుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి పర్యటన ముగించుకుని కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని జాతీయ రహదారిపై దర్గా చౌరస్తా వద్దకు రాగానే ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ప్రమాద సమయంలో కారులో బల్మూరి వెంకట్ దంపతులతో పాటు ఆయన సోదరుడు చాణక్య, డ్రైవర్ శ్రీకాంత్ ఉన్నారు. అయితే ఎయిర్ బెలూన్లు సమయానికి తెరుచుకోవడంతో బల్మూరి వెంకట్ దంపతులకు ఎలాంటి గాయాలు కాలేదు, వారు పూర్తి క్షేమంగా బయటపడ్డారు. డ్రైవర్ శ్రీకాంత్, సోదరుడు చాణక్యకు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం దెబ్బతిన్న వాహనాన్ని పక్కకు తొలగించి హైవేపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Advertisement

Also Read: మైక్రోసాఫ్ట్ నుంచి బ్యాంకుల వరకు.. అమెరికాలో అసలేం జరుగుతోంది?

Tags

Related News

హైదరాబాద్‌ సిటీలో మరోసారి భూముల అమ్మకం.. ఏయే ప్రాంతాలు, ఈ-ఆక్షన్ తేదీలు ఇవే!

ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయం చాలా ప్రమాదకరం.. ఎలానో క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత!

తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల..?

కాంగ్రెస్ అభయ హస్తం మొత్తం శూన్య హస్తమే.. హరీష్ రావు ఫైర్!

ఏపీ కాంట్రాక్టు ఉద్యోగాల జాబ్ స్కామ్‌లో.. మేడ్చల్ ప్రాంత లింకులు..?

కూరగాయల వ్యాపారంతో.. గంజాయి దందా కలకలం

గద్వాల్‌లో నిద్రిస్తున్న నిఘాలు.. పట్టించుకోని అధికారులు

Big Stories

Advertisement
×