E-Paper
Advertisement

ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయం చాలా ప్రమాదకరం.. ఎలానో క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత!

ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయం చాలా ప్రమాదకరం.. ఎలానో క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత!
Advertisement

Inter Board: రాష్ట్రంలో 55 ఏళ్లుగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ బోర్డును ఏకపక్షంగా రద్దు చేయాలన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమాజిగూడలోని ఓ హోటల్ లటో మంగళవారం ‘ఇంటర్ బోర్డు రద్దు – తెలంగాణ విద్యపై ప్రభావం’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ వెంటిలేటర్ పైకి వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంటర్ బోర్డును రద్దు వద్దు..

బీఆర్ఎస్ పాలనలో ఐసీయూలో ఉన్న విద్యా వ్యవస్థ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరింత ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఇంటర్ బోర్డును రద్దు చేయాలన్న నిర్ణయం వెనుక తెలంగాణ విద్యార్థులకు స్థానికత అంశంలో నష్టం చేసే కుటిల యత్నం ఉందని ఉందన్నారు. ఆంధ్రా ప్రజలకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డును రద్దు చేసి 9 వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు ఆంధ్రా విద్యాసంస్థలకు అనుమతిచ్చే పని చేస్తున్నారన్నారు. దీని కారణంగా ఆంధ్రా విద్యాసంస్థల్లో అమలాపురంలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు హైదరాబాద్‌లో పరీక్ష రాసి లోకల్ గా చెలామణి అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “ఇంటర్ బోర్డు రద్దు అనే తప్పుడు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు.

అది ఎవరికీ మేలు..

Advertisement

ఈ నిర్ణయం కారణంగా ఏ రకంగానూ తెలంగాణ విద్యార్థులకు మేలు జరిగే అవకాశం లేదన్నారు. ఏదైనా సంస్కరణగానీ, మార్పు గానీ చేయాల్సినప్పుడు దానికి ప్రూవ్డ్ ఎవిడెన్స్ అనేది ఉండాలన్నారు. ఇంటర్ బోర్డును విద్యాశాఖలో విలీనం చేయటమనేది విఫల ప్రయోగమని ఏపీ చేసిన ప్రయోగం ద్వారా మనకు స్పష్టమైందని గుర్తుచేశారు. అయిన సరే ఇంటర్ బోర్డు రద్దు చేయాలని నిర్ణయించటమంటే అది ఎవరికీ మేలు చేసేందుకనీ ఆమె ప్రశ్నించారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు మేలు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను చదువుకు దూరం చేస్తారా అని మండిపడ్డారు. అఖిలపక్షం, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఇలా ఎవరితో చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వాని నిలదీశారు.

Also Read: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు షాకింగ్ న్యూస్..?

ఐక్య పోరాటాలు..

Advertisement

ముందు ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఇంటర్ బోర్డు ను రద్దు చేస్తే జూనియర్ లెక్చరర్లు, కాలేజ్‌ల పరిస్థితి ఏంటనీ ప్రశ్నించారు. డ్రాప్ ఔట్లు జరిగితే అది ప్రభుత్వం తప్పు.. కనుక దాన్ని సరిదిద్దుకోవాలన్నారు. అంతేకానీ ఆ పేరు చెప్పి ఇంటర్ బోర్డును రద్దు చేస్తామని చెప్పటం సరికాదన్నారు. ఈ అంశానికి సంబంధించి బిల్లు పెట్టాలని ప్రభుత్వం భావిస్తే కచ్చితంగా పబ్లిక్ హియరింగ్ నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఐక్య పోరాటాలు చేసైనా అడ్డుకుంటామన్నారు. తెలంగాణలో విద్య అందరికీ దక్కాలన్నదే తమ పార్టీ సంకల్పమని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ విద్యారంగాన్ని తాము కాపాడుకుంటామన్నారు.

అనుమానాలున్నాయి..

సీనియర్ ఎడిటర్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటర్ బోర్డు రద్దు చేస్తామని ప్రభుత్వం చెబుతున్న దాంట్లో చాలా అనుమానాలున్నాయన్నారు. ఈ అనుమానాలకు సమాధానం చెప్పకుండా ఇంటర్ బోర్డును రద్దు చేస్తామంటే అంగీకరించేది లేదన్నారు. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ మాట్లాడుతూ ఇంటర్ బోర్డు రద్దు కారణంగా ఏం లాభం జరుగుతుందన్నది ప్రభుత్వం చెప్పలేకపోతోందన్నారు. ఇంటర్ విద్య జేఏసీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్ బోర్డు రద్దు కారణంగా ప్రయోజనం ఏంటన్నది ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం సాధికారికంగా చెప్పలేదని అన్నారు. ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పై పెరిగిన వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే ఇలాంటి సున్నితమైన అంశాన్ని ముఖ్యమంత్రి డైవర్షన్ రాజకీయాల కోసం వాడుకుంటున్నారనిఆరోపించారు.

ఈ సమావేశంలో..

సమావేశంలో అశోక్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ, శివరాత్రి యాదగిరి, ట్రస్మా ప్రెసిడెంట్, ఎస్. నాగేశ్వర్, జార్జ్ రెడ్డి పీడీఎస్ యూ, విజయ్, పీడీఎస్ యూ స్టేట్ జనరల్ సెక్రటరీ, శ్రీనివాస్ రెడ్డి, ట్రస్మా ప్రెసిడెంట్, మధుసూదన్, ట్రస్మా ఛైర్మన్, సాయికుమార్, టీఎస్కేవీ, వెంకట్ సాయినాథ్, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్, రాజ్ కమల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, సురేష్ బాబు, సీనియర్ జర్నలిస్ట్, కృష్ణలత, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అసోసియేషన్, రవి, యూఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్, మొహన్ కుమార్, ట్రస్మా స్టేట్ ప్రతినిధి, రంజిత్, రిపబ్లికన్ స్టూడెంట్ ఫెడరేషన్, ఝాన్సీ లు ప్రసంగించి తమ అభిప్రాయాలు తెలిపారు.

Also Read: కాంగ్రెస్ అభయ హస్తం మొత్తం శూన్య హస్తమే.. హరీష్ రావు ఫైర్!

Tags

Related News

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పై.. కీలక వ్యాఖ్యలు చేసిన మహేష్ కుమార్ గౌడ్!

ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కావాలనుకునే వారికి షాకింగ్ న్యూస్?

క్రీడల విషయంలో.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు చాలెంజ్?

ఇకపై సభలు, ఫంక్షన్ల నిర్వహణపై.. మున్సిపల్ కార్పొరేషన్ కొత్త రూల్స్?

కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్.. బీఆర్ఎస్‌కు సవాల్!

తెలంగాణకు అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు!

‘షీ టీమ్స్’ పేరుతో నకిలీ నోటీసు.. మాజీ ప్రియుడిపై యువతి రివేంజ్.. పోలీసులు సైతం షాక్!

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీతో సీఎం రేవంత్ భేటీ.. ఆ అంశాలపై చర్చ!

Big Stories

Advertisement
×