E-Paper
Advertisement

Mallareddy: మల్లన్నా.. ఇదేందన్నా.. మంత్రికి షాక్!

Mallareddy: మల్లన్నా.. ఇదేందన్నా.. మంత్రికి షాక్!
Advertisement

Mallareddy: మంత్రి మల్లారెడ్డి. ధూంధాంగా డైలాగులు చెప్పడంలో ఎక్స్ పర్ట్. ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలుస్తుంటారు. ఆయన ఏం మాట్లాడినా అటెన్షన్. రేవంత్ రెడ్డి వర్సెస్ మల్లారెడ్డి ఎపిసోడ్ అప్పట్లో హాట్ టాపిక్. ఇక మంత్రి గారికి నిరసనలు, ఆందోళనలూ తక్కువేం కాదు. నియోజకవర్గంలో పలుమార్లు మల్లారెడ్డి పర్యటనలను అడ్డుకున్నారు. లేటెస్ట్ గా మరోసారి మల్లారెడ్డిని హామీలపై నిలదీశారు కాంగ్రెస్ నేతలు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో పాదయాత్ర చేస్తున్నారు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి. గబ్బిలాలపేటలో పాదయాత్ర చేస్తుండగా.. కాంగ్రెస్ నాయకులు మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 50 పడకల ఆసుపత్రి, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చి ఇప్పటివరకూ అది నెరవేర్చలేదంటూ నిలదీశారు.

Advertisement

మంత్రి మల్లారెడ్డిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే టీఆర్ఎస్ శ్రేణులు తిరగబడ్డాయి. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్పందించిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×