BigTV English

Income Tax : వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గించండి: కేంద్రాన్ని కోరిన సీఐఐ

Income Tax : వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గించండి: కేంద్రాన్ని కోరిన సీఐఐ

Income Tax : 2023-24 బడ్జెట్ కోసం కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది… భారతీయ పరిశ్రమల సమాఖ్య-CII. వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లను తగ్గించడంతో పాటు… వస్తుసేవల పన్ను, మూలధన లాభాల పన్ను రేట్లను పునఃపరిశీలించాలని కోరింది. పన్నుల ఎగవేతను అరికట్టడానికి GST చట్టం ఇప్పటికే తగిన శిక్షార్హమైన నిబంధనలను కలిగి ఉందని… GST చట్టాన్ని నేరరహితం చేయాలని CII సూచించింది.


సంస్కరణల్లో భాగంగా వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లను తగ్గిస్తే.. ప్రజల దగ్గర డబ్బు మిగులుతుందని, అది డిమాండ్ సైకిల్ ను పునరుద్ధరిస్తుందని CII అభిప్రాయపడింది. GST రేట్లు, మూలధన లాభాల పన్నుపై పునఃపరిశీలన జరపాలని… అప్పుడే అస్థిరత, ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పింది. వివిధ వ్యాపారాలకు విధించే పన్నుల్లో కచ్చితత్వం కొనసాగాలని, కార్పొరేట్ పన్ను రేట్లను ప్రస్తుత స్థాయిలోనే కొనసాగించాలని CII సూచించింది. వ్యాపారాల్లో జరిగే నేరాల్ని ఎలాంటి అనుమానాలకు తావులేకుండా రుజువు చేయలేకపోతే… సివిల్ కేసుల్లో అరెస్టులు లేదా నిర్బంధం జరగకూడదని CII అభిప్రాయపడింది.

ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడేలా నమ్మకమైన రోడ్ మ్యాప్ రూపొందించి బడ్జెట్లో ప్రకటించాలని… అది క్రమంగా ద్రవ్యలోటును తగ్గిస్తుందని CII సూచించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు GDPలో 6 శాతానికి, 2026 నాటికి 4.5 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేసింది. పెట్టుబడుల పునరుద్ధరణపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రీ-బడ్జెట్ మెమోరాండంలో కూడా… 2024 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాన్ని 2.9 శాతం నుంచి 3.3-3.4 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది… CII. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు వంటి సంప్రదాయ మౌలిక సదుపాయాలతో పాటు… పునరుత్పాదకాల వంటి హరిత మౌలిక సదుపాయాల మీద కూడా కేటాయింపులను పెంచాలని సూచించింది. దీనికి అదనంగా, మౌలిక సదుపాయాల కల్పనలో తగని సామర్థ్యాన్ని తీసుకురావడానికి… గతి శక్తి, NIPల పూర్తి అమలును వేగవంతం చేయాలని సూచించింది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×