BigTV English

TGPSC Group 1: నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. పకడ్బందీగా భద్రత

TGPSC Group 1: నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. పకడ్బందీగా భద్రత

TGPSC Group 1 Mains Exams: రాష్ట్రంలో నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21 నుంచి 27 వరకు జరగనున్న ఈ పరీక్షలకు 31,383మంది అభ్యర్థులు రాయనున్నారు.


మొత్తం రాష్ట్రంలో 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయగా.. ఆయా పరీక్ష కేంద్రాలను కలెక్టర్లు, పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అన్ని కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ డీజీపీ ప్రకటించారు.

పరీక్షలు జరుగుతున్న సమయంలో ఆయా కేంద్రాల నుంచి 200మీ. దూరం వరకు ఆంక్షలు విధించారు. మరోవైపు గ్రూప్ 1 నోటిఫికేషన్‌లోని జీఓ 29 రద్దు చేసి పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని గత కొంతకాలంగా అభ్యర్థులు తీవ్ర ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.


Also Read: హైదరాబాద్‌ను రోల్ మోడల్‌గా మార్చాలి: సీఎం రేవంత్ రెడ్డి

జీఓ రద్దు, పరీక్షల తేదీలను మార్చమని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కొంతమంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయగా..కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ నేడు విచారణకు రానుంది.

నిబంధనలు..

  •  అభ్యర్థులను డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేశాక పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
  • ఇన్విజిలేటర్లుకచ్చితంగా మార్గదర్శకాలు పాటించాలని సూచించింది.
  • ఏదైనా ప్రభుత్వ ఐడెంటిటీ కార్డు తప్పనిసరి
  • బ్లూ లేదా బ్లాక్ పెన్ను, పెన్సిల్, రేజర్ అవసరం
  • పెన్సిల్ లేదా పెన్నుతోనే డ్రాయింగ్ వేయాలి. జెల్,స్కెచ్ పెన్స్ ఉపయోగించవద్దు.
  • పరీక్షలు పూర్తయ్యే వరకు ఒకే హాల్ టిక్కెట్‌ను ఉపయోగించాలి. హాల్ టిక్కెట్‌పై పేర్కొన్న స్థలంలో అభ్యర్థితో పాటు ఇన్విజలేటర్ సంతకం చేయాలి.
  • జవాబులు రాసేందుకు బుక్ లెట్ ఇస్తారు. అడిషనల్స్ ఇవ్వరు.
  • అభ్యర్థి ఎంపిక చేసుకున్న భాషలోనే సమాధానాలు రాయాలి.
  • ఇతర భాషల్లో రాస్తే ఆ జవాబు పత్రాలను అనర్హమైనవిగా గుర్తిస్తుంది.
  • పరీక్ష రాయడానికి సహాయకులు అవసరమైన దివ్యాంగ అభ్యర్థుల హాల్ టిక్కెట్లపై ‘స్క్రైబ్’ విషయాన్ని పేర్కొంటారు.
  • దివ్యాంగుల కోసం 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరు సదరం ధ్రువపత్రం తీసుకు రావాల్సి ఉంటుంది.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×