E-Paper
Advertisement

Wishes Pour in CM Revanth Reddy | రేవంత్ రెడ్డికి శుభాకాంక్షులు తెలిపిన మోదీ, రాహుల్ గాంధీ, హరీష్ రావు, చిరంజీవి

Wishes Pour in CM Revanth Reddy | తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షులు తెలిపారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన శుభాకాంక్షులు తెలుపుతూ.. తెలంగాణ అభివృద్ధికి తాము అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పారు.

Wishes Pour in CM Revanth Reddy | రేవంత్ రెడ్డికి శుభాకాంక్షులు తెలిపిన మోదీ, రాహుల్ గాంధీ, హరీష్ రావు, చిరంజీవి

Wishes Pour in CM Revanth Reddy | తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షులు తెలిపారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన శుభాకాంక్షులు తెలుపుతూ.. తెలంగాణ అభివృద్ధికి తాము అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిజేశారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు, మంత్రులందరికీ నా శుభాకాంక్షలు. ట్విట్టర్‌లో ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ.. తెలంగాణలో ఇప్పుడే ప్రజల సర్కార్ ప్రారంభమైంది. అందరూ కలలుగన్న బంగారు తెలంగాణ మేము సాధిస్తాము.. ఇచ్చిన ఆరు గ్యారింటీలను పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు.

అలాగే సిఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బిఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డితోపాటు ఉపముఖ్యమంత్రి మల్లు భత్తి విక్రమార్కకు హరీష్ రావు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

‘‘ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మల్లు భట్టి విక్రమార్కకి, అలాగే మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని హరీష్‌రావు ట్వీట్ చేశారు.

రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులలో నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ట్విట్టర్ ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేస్తూ.. తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో పాటు.. మంత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ నాయకత్వంలో మన రాష్ట్రం ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను.. అని రాశారు.

రేవంత్ రెడ్డికి తెలుగుదేశం నేషనల్ జెనెరల్ సెక్రటరీ నారా లొకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్మమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు మీ పాలనా పదవీ కాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.

ముఖ్యమంత్రిగా ప్రమాన స్వీకారం చేస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం నేపథ్యంలో నందిగామ, వీరులపాడులో బ్యానర్లు వెలిశాయి.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×