BigTV English

Tomato latest price: టమా’ఠా’.. పైపైకి ధర..

Tomato latest price: టమా’ఠా’.. పైపైకి ధర..
Tomato price today

Tomato price today(Local news Andhra Pradesh) : టమాటా ధరలు రోజురోజుకు ఆకాశన్నంటేలా పెరుగుతున్నాయే తప్ప దిగి రావడం లేదు. మదనపల్లె మార్కెట్‌లోనే కిలో టమాటా ఏకంగా 168 పలికింది. సామాన్యుల చేతికి వచ్చేసరికి దీని ధర ఇంకెంత ఉంటుందో ఊహించానికే భయపడే పరిస్థితి ఏర్పడింది.


మదనపల్లె మార్కెట్‌లో నాణ్యమైన ఏ గ్రేడ్‌ టమాట 140 నుంచి 168 వరకు.. బీ గ్రేడ్ టమాట 118 నుంచి 138 రూపాయల వరకు పలుకుతుంది. రోజురోజుకు మార్కెట్‌ కు వచ్చే టమాట తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

గత కొన్ని రోజులుగా టమాట ధరలు భారీగా పెరుగుతున్నాయి. అనేక మంది టమాట రైతులు కోటీశ్వరులుగా మారుతున్నారు. బంగారం, నగలు దోచుకున్నట్టు.. టమాటాలను దోచుకుంటున్నారు. ఎక్కడైనా టమాటా లారీనో.. ట్రక్కో.. బోల్తా పడితే పోలీసులు కాపలా ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. కొంతమంది రైతులైతే తమ టమాటా పంటకు ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే టమాటా డిమాండ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.


గత 45 రోజులుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. కొన్ని మార్కెట్‌లలో కిలో టమాటా 150 నుంచి 200 రూపాయల వరకూ పలుకుతోంది. దీంతో టమాటాలను కొనాలంటే సామాన్య ప్రజలు జడుసుకుంటున్నారు. సామాన్య ప్రజలు అయితే టమాటా వైపు చూడ్డమే మానేశారు. దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో.. టమాటా పంట దిగుబడి కూడా తగ్గింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండనుంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×