E-Paper
Advertisement

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి షాకింగ్ న్యూస్..?

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి షాకింగ్ న్యూస్..?
Advertisement

Komatireddy Remarks: స్వేచ్చ బ్యూరో: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. సొంత పార్టీ ప్రభుత్వాన్నే ఇరుకున పెట్టేలా ఆయన చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఉన్న కారణాలు, అవి పార్టీ ప్రతిష్టపై చూపుతున్న ప్రభావంపై టీపీసీసీ ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదికను (ప్రిలిమినరీ రిపోర్టు) సిద్ధం చేసినట్లు గాంధీభవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

పూర్తి వివరాలతో..

రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలను పూర్తి వివరాలతో ఇంగ్లీష్​,హీందీలో అనువాదిస్తూ రిపోర్టులో పొందుపరిచినట్లు సమాచారం. ఆయన ఎప్పుడు, ఏ సందర్భంలో, ఏం మాట్లాడారనే అంశాలతో పాటు, ఆయా ప్రసంగాల వీడియో క్లిప్పింగ్‌లను, మీడియా కథనాలను ఈ నివేదికకు జత చేసినట్లు తెలుస్తోంది.

నేడు ఇన్‌ఛార్జి సందీప్‌తో కీలక భేటీ..

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఏఐసీసీ ఇన్‌ఛార్జి బీఎం సందీప్ నేడు రాష్ట్రానికి రానున్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వస్తుండటంతో, పార్టీలోని అంతర్గత విభేదాలు, తాజా రాజకీయ పరిణామాలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.

రాజగోపాల్ రెడ్డికి ఫోన్..

ఈ భేటీలో రాజగోపాల్ రెడ్డితో పాటు జడ్జర్ల ఎమ్మెల్యే అనిరుద్ద్ రెడ్డి చేసిన వ్యాఖ్యల అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సందీప్‌తో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం, సిద్ధం చేసిన ప్రాథమిక నివేదికను అధిష్టానానికి (ఏఐసీసీకి) పంపించాలని టీపీసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీపీసీసీ నుంచి రాజగోపాల్ రెడ్డికి ఫోన్ వెళ్లినట్లు సమాచారం.

Advertisement

Also Read: కొత్త బైక్, వాహనాలు కొనేవారికి బిగ్ అలర్ట్.. డీలర్లకు సర్కార్ వార్నింగ్?

Tags

Related News

కొత్త బైక్, వాహనాలు కొనేవారికి బిగ్ అలర్ట్.. డీలర్లకు సర్కార్ వార్నింగ్?

ఇంట్లో దర్జాగా గంజాయి సాగు చేస్తున్న బీటెక్ విద్యార్థి!

హుజురాబాద్‌లో డేంజర్ బెల్స్.. పొంచి ఉన్న భారీ ప్రమాద ముప్పు!

పింఛన్ కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి?

ఐబొమ్మ రవిని మించిన మరో డిజిటల్ పైరసీ నెట్‌వర్క్.. ఒక్కో సినిమాకు రూ. 20 వేలు!

ఎవరీ రేష్మా డాన్? బ్యూటీషియన్‌గా పనిచేస్తూ రౌడీయిజం.. చివరికి ఏమైందంటే?

తెలంగాణలో కొత్త పెన్షన్లు అప్లై చేసుకున్న వారికి గుడ్ న్యూస్..?

Big Stories

Advertisement
×