Movie Piracy: కొత్తగా విడుదలైన సినిమాలను థియేటర్లలో రికార్డు చేసి ఆన్‌లైన్‌లో విక్రయం చేస్తూ.. సినిమా పైరసీకి పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. కర్నూలులోని SVC సినిమాస్‌లో మొబైల్ ఫోన్లతో సినిమాల రికార్డింగ్ చేసి ఆ రికార్డు చేసిన సినిమాలను Gofile.comలో అప్‌లోడ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.
టెలిగ్రామ్ ద్వారా ప్రధాన నిందితుడితో పైరసీ వ్యవహారాల సమన్వయం చేస్తూ.. go2.india4movies.click వెబ్‌సైట్ ద్వారా సినిమాల పైరసీ పంపిణీ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కో సినిమా రికార్డింగ్‌కు రూ.20 వేల చొప్పున క్రిప్టోకరెన్సీ చెల్లింపులు చేస్తూ.. అనంతరం క్రిప్టోను భారతీయ కరెన్సీగా మార్చుకున్నట్టు పోలీసులు గుర్తించారు. రామాయణ, సీన్, మహాశక్తి, ENE, ఆకాశంలో ఒక తార సహా పలు సినిమాల పైరసీ చేసినట్టు పోలీసులు గుర్తించారు.
Also Read: తెలంగాణలో కొత్త పెన్షన్లు అప్లై చేసుకున్న వారికి గుడ్ న్యూస్..?
నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పైరసీ వెబ్‌సైట్లలో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలు చేస్తునట్టు గుర్తించారు. దీంతో క్రిప్టో లావాదేవీలపై పోలీసులు లావాదేవీలు కొనసాగిస్తున్నారు. నెట్‌వర్క్‌లోని ఇతర వ్యక్తుల కోసం పోలీసుల గాలింపు చర్యులు చేపట్టారు. TGCSB, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో 2026 జనవరి 5న యాంటీ పైరసీ యూనిట్ ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 42,151 పైరసీ URLలు బ్లాక్ చేసారు.
ప్రధాన హోస్టింగ్ సర్వర్లకు 87 నోటీసులు ఇచ్చారు. ఈ సంఘటనకు దాదాపుగా 8 మంది అనుమానితులను పోలీసులు గుర్తించి 5 మందిని అరెస్ట్ చేశారు. గత 7 నెలల్లో 20కి పైగా సినిమాలకు పైరసీ నిరోధక చర్యలు చేసి, సుమారు రూ.33.6 కోట్ల సినీ పరిశ్రమ నష్టాన్ని నివారించినట్లు TGCSB వెల్లడించింది. సినిమాటోగ్రాఫ్ చట్టం, ఐటీ చట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోనున్నట్టు పోలీసులు తెలిపారు. పైరసీ నెట్‌వర్క్‌లో మిగిలిన వ్యక్తుల గుర్తింపుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read: మీ గ్యాస్ సిలిండర్ నెల కూడా రావడం లేదా? కారణాలివే కావొచ్చు!